Firecrackers : తమిళనాడులో గోడౌన్ లో బాణాసంచా పేలి భారీ అగ్నిప్రమాదం

Firecrackers
Firecrackers : తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా గోడౌన్ లో పేలుడు సంభవించడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. చాటూరులోని ఓ ప్రైవేటు గోడౌన్ లో దీపావళి కోసం భారీగా బాణాసండా నిల్వ ఉంచడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
దాదాపు గంటపాటు భారీ శబ్దాలతో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది సమీప ప్రాంతాలకు వెళ్లడానికి ఇబ్బందిగా మారింది. ఈ ప్రమాదంలో మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది.