Renu Desai : ప్రతీ కుటుంబంలో ఎవరిదో ఒకరిదే పెత్తనం నడుస్తుంది. కొందరి ఇళ్లల్లో అత్తది పెత్తనం అయితే.. మరికొందరి ఇళ్లల్లో కోడలుది పెత్తనం ఉంటుంది. ఒక్కోసారి ఈ పెత్తనాలే కుటుంబాలను, మనుషులను ఇబ్బందుల పాలు చేస్తుంటాయి. కానీ కొన్ని పెత్తనాలు చాలా స్వీటుగా ఉంటాయి. పెత్తనం కూడా ఆనందంగా అందంగా స్వీటుగా ఉంటుందా? అన్న అనుమానం కలుగుతుంది కదూ.. అవును కొన్ని అలానే ఉంటాయి. అవే పిల్లల పెత్తనాలు.
ఒక వంశాంకురం తల్లి కడుపులో పడ్డప్పటి నుంచి గారాబాలు చేస్తుంటుంది పూర్తి కుటుంబం. ఇక ఆ బిడ్డ భూమిపై కాలు మోపినప్పటి నుంచి ఇక కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ ఆ బిడ్డ చుట్టే ఉంటారు. చిన్నారులు అంటే అంత ఆనందం ఉంటుంది. ఎవ్వరైనా సరే చిన్నారులు ఏది చెప్పానా వినాల్సిందే. మొత్తం పెత్తనం వారికి ఇవ్వాల్సిందే. అదే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంట్లో కూడా పెద్ద మొత్తం చిన్నారిదేనట ఆమే ఆధ్య.
ఒక టీవీ షోలో పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టింది. పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏదైనా చెప్తే విన్నా.. వినకపోయినా.. ఆధ్య చెప్తే మాత్రం కచ్చితంగా వింటారట. ఇంట్లో మొత్తం పెత్తనం ఆధ్యదేనట. అంతేకాదు ఆధ్య కాల్ చేసి ఎక్కడున్నావ్.. నిన్ను చూడాలని ఉంది రా.. అంటే వెంటనే వచ్చేస్తారట. ఆధ్యా ఏది అడిగితే అది చేస్తారట. ఏదైనా కావాలనిపిస్తే డాడీ నాకు ఇది కావాలి అంటే సెకండ్స్ లోనే కళ్ల ముందు ఉంచుతారట.
అంత ప్రేమ ఆధ్యా అంటే పవన్ కళ్యాణ్ కు అంటూ రేణు దేశాయ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ విషయంలో పెత్తనం మొత్తం కూడా అమ్మ కన్నా, భార్య కన్నా కూతురిదే? అని ఇప్పుడు ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు.