Arvind Kejriwal : జైల్లో కేజ్రీవాల్ తినకూడనివి అన్నీ తింటున్నారట..ఈడీ వింత ఆరోపణ..

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ కుంభకోణం దేశంలో తీవ్ర చర్చనీయంశమైన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ తీహార్ జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అంతే కాదు తినకూడనివి అన్నీ తింటున్నారు. తాజాగా ఎన్ ఫోర్ మెర్స్ డైరెక్టరేట్ అధికారులు కోర్టుకు అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను చెప్పారు..

కేజ్రీవాల్ డయాబెటిస్ పేషెంట్ కావడంతో ఆయన చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో తన రెగ్యులర్ డాక్టర్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ ఇటీవల ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిపిన ప్రత్యేక కోర్టుకు ఈడీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేసింది.

కేజ్రీవాల్ అభ్యర్థనను వ్యతిరేకించిన ఈడీ ఇంటి భోజనానికి అనుమతి ఉండడంతో ఆయన తనకు ఇష్టమైన ఆహార పదార్థాలను తింటున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డయాబెటిస్ పేషెంట్ అయినప్పటికీ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే అరటి పండు, మామిడి, స్వీట్లు, ఆలు పూరీ వంటివి తింటున్నారని, షుగర్ లెవల్స్ పెరిగే ఆహారాన్ని ఆయన ఉద్దేశ పూర్వకంగా తింటున్నారని, కేజ్రీవాల్ బెయిల్ కోసం ఇదంతా చేస్తున్నారని ఈడీ ఆరోపించింది.

జైలులో కేజ్రీకి రోజుకు రెండు సార్లు షుగర్ లెవల్స్ చెక్ చేస్తున్నారని ఈడీ వెల్లడించింది. ఏప్రిల్ 1వ తేదీన అరెస్ట్ చేసిన నాటి నుంచి ఇప్పటివరకు జైల్లో ఆయన షుగర్ లెవల్స్ రెట్టింపు అయ్యాయని ఈడీ కోర్టు దృష్టికి తీసుకు వెళ్లింది. ఇక ఈడీ వాదనతో ఏకీభవించని కేజ్రీవాల్ తరపు న్యాయవాది ఈడీ ఆరోపణలను ఖండించారు.

ఈడీ ఆరోపణలను ఖండించిన కేజ్రీవాల్ న్యాయవాది.. ఇంటి భోజనం రాకుండా చేయడానికి ఈడీ ప్రయత్నం చేస్తోందని.. అందుకే కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తున్నారని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ధర్మాసనం అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించిన భోజనంతో పాటు, డైట్ చార్ట్ పై శుక్రవారం లోపు నివేదిక ఇవ్వాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించారు. దీనిపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు.

TAGS