Jagan Sarkar : జగన్ ఇలాకాలో రవాణా రంగం అద్వాన్నం 

Jagan Sarkar

Jagan Sarkar

Jagan Sarkar : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రెండో దఫా జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రభుత్వం ఏర్పడటంతో రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడిపై ప్రజలకు ఎందుకు విసుగు వచ్చిందో వాళ్ళకే తెలియాలి. జగన్ కు మాత్రం భారీ మెజార్టీ ఇచ్చారు. అత్యధిక మెజార్టీ తో అధికారం చేపట్టిన జగన్ పరిపాలన అస్తవ్యస్తంగా తయారైనది.కార్యకర్త నుంచి మొదలుకొని మంత్రి వరకు ప్రజలకు జగన్ పరిపాలన ఇబ్బందికరంగా తయారైనది. 

అధికారంలోకి రాగానే  ప్రభుత్వ ఆస్తులపై వైసీపీ పార్టీ రంగు వేయించి తన మార్కు ఏమిటో జగన్ ప్రజలకు చూపించారు. ఆస్తులకు సంబంధించిన పట్టా పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ ముద్రించారు. దీనిపై ముక్కుసూటిగా జగన్ భార్య భారతీ రెడ్డి ని ప్రజలు నిలదీశారు. మేము కస్టపడి సంపాదించిన ఆస్తులపై జగన్ బొమ్మ ఎందుకు ఉండాలి అని ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేక వెనుదిరిగి పోయారు. అంతే కాదు విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో కూడా జగన్ బొమ్మ ఉండటం కూడా విద్యార్థుల తల్లి దండ్రులకు నచ్చలేదు. 

ఇసుక రవాణా అయితే  వైసీపీ కండువా కప్పుకున్న వారిలో దాదాపు అందరికి కాసులు కురిపించింది. తోడుకున్నోళ్లకు తోడుకున్నంత ఇసుక అన్నట్టు తయారైనది ఇసుక వ్యవహారం. ఇసుక మాఫియాపై కూడా ప్రజలు విసుకోక తప్పలేదు.అంతే కాదు ప్రభుత్వ ఆస్తులకు కూడా రక్షణ లేకుండ పోయింది. ప్రభుత్వ స్థలాలు కనబడితే చాలు కబ్జాలు చేసి అందినకాడికి తీసుకున్నారనే ఆరోపణలు జగన్ హయాంలో కోకొల్లలు. 

వైసీపీ హయాంలో రవాణా రంగం కూడా అద్వాన్నంగా తయారైనదనే ఆరోపణలు ఉన్నాయి.ప్రైవేట్ వాహనాలు ఉపాధి కోసం కొనుగోలు చేసుకున్న వారి కుటుంబాలు ప్రభుత్వం తీరుపై అసంతృప్తితో ఉన్నారు.చిన్న,చిన్న తప్పులకు కేసులు నమోదు చేయడం, అడ్డగోలుగా  చార్జీలు వసూలు చేయడం జరిగింది. దింతో కొందరు పొట్టకూటి కోసం కొనుగోలు చేసిన వాహనాలను భరించలేక అమ్ముకోవడం జరిగింది. ఆర్టీసీ సంస్థ ను అందనంత పాతాళ లోకానికి తొక్కేశారని సంస్థ కార్మికులే ఆరోపించడం విశేషం. సంస్థను అభివృద్ధి చేయకుండా అణగతొక్కడానికే ఎక్కువ ప్రయత్నాలు చేశారు. ప్రైవేట్ వాహనాలపై అడ్డగోలుగ పన్నులు విధించి, వసూలు చేయడం తో పన్నులు కట్టలేక వాహనాలను అమ్ముకునే పరిస్థితి తీసుకురావడం జరిగింది జగన్ పరిపాలనలో.

TAGS