Indian men : ఇండియాలో మగాళ్లకు శృంగారం చేయడం రాదు.. సంచలనం రేపుతున్న కామెంట్స్.
Indian men : టెక్నాలజీ రోజురోజుకూ మారుతోంది. ఆధునిక కాలంతో పాటు మనం కూడా మారాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఇది వాస్తవమేనని అనిపిస్తోంది. గతంలో మన దేశంలో శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడుకునేందుకు చాలా సిగ్గుపడేవారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. మన దేశంలో కూడా శృంగారం గురించి నేరుగానే మాట్లాడుకుంటారు.
డేటింగ్ , లివింగ్ రిలేషన్ షిప్ వంటి ఫారిన్ కంట్రీస్ కల్చర్ మనకు కూడా వచ్చేసింది. తాజాగా చేతన చక్రవర్తి అనే లైఫ్ కోచ్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఇండియాలోని మగాళ్లకు శృంగారం చేయడం రాదని ఈ వీడియోలో ఆమె చెప్పడం నెట్టింట పెద్ద దుమారమే నెలకొంది. ఈ వీడియోలో చేతన మాట్లాడుతూ.. ‘నేను భారతీయ పురుషులతో డేటింగ్ చేయనని చెప్పింది. భారతీయ పురుషులు అమ్మాయిల చిన్న చిన్న హావభావాలు కూడా అర్థం చేసుకోరు. ఇల్లును క్లీన్ గా ఉంచుకోరు.
నేను ఇండియన్ మగాళ్లతో డేటింగ్ చేయకపోవడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి. 1. తన ముందున్న మహిళను రెస్పెక్ట్ లేకుండా పిలుస్తారు. 2. ఒక సమస్య గురించి మాట్లాడేటప్పుడు సైలెంట్ గా ఉంటారు. 3. వారికి శృంగారం అంటే అర్థం కాదు. శృంగారం అంటే నెలకు ఒక డిన్నర్ డేట్ అని మాత్రమే వారికి తెలుసు. అందుకే నేను భారతీయ కుర్రాళ్లతో డేటింగ్ చేయను ’’ అంటూ లైఫ్ కోచ్ చేతన చక్రవర్తి వీడియోలో చెప్పుకొచ్చింది.
మరీ చేతన వేరే దేశపు వ్యక్తి అనుకుంటున్నారా? కాదు.. ఇండియన్ అమ్మాయే. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ ఇండియన్ అయి ఉండి, మన దేశపు పురుషుల గురించి ఇలాంటి కామెంట్స్ చేస్తావా అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆమె మాటలతో ఏకీభవిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.