Hyderabad : హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో.. మహిళా వేషంలో వచ్చి దొంగతనం

Hyderabad

Hyderabad

Hyderabad : హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో దొంగలు మహిళల వేషంలో వచ్చి బీభత్సం సృష్టించారు. అపార్టుమెంట్ లోకి వెళ్లి ఓ ఫ్లాట్ తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెక్కాలనీ ఆకృతి ఆక్రేడ్లోలోని ఫ్లాట్ నెం.502లో ప్రైవేటు ఉద్యోగి కే.వెంకటేశ్వర రావు ఉంటున్నారు. అదే అపార్టుమెంట్ లోని 406 ఫ్లాట్ల్ లో ఆయన కూతురు, అల్లుడు ఉంటున్నారు. వెంకటేశ్వర రావు 16వ తేదీ రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి ఒంగోలు వెళ్లారు. 18వ తేదీ శని వారం ఉదయం ఇంటికి పనిమనిషి 502 ఫ్లాట్ కు రాగా ఇంటి తాళం పగులగొట్టి ఉండడం గమనించింది. ఇంట్లోకి వెళ్ల చూడగా సామగ్రి అంతా చిందరవందరగా కనిపించడంతో వెంకటేశ్వర రావు కుమార్తెకు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులకు రిపోర్టు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.

అయితే, సీసీ కెమెరాలను పరిశీలించగా 18వ తేదీ తెల్లవారు జామున మహిళల వేషధారణలో ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు అపార్టుమెంట్ లోకి చొరబడి 502 ఫ్లాట్ తాళం పగులగొట్టి ఇంట్లోని అల్మారాలో దాచిన 4 తులాల బంగారు ఆభరణాలు, లక్ష నగదు, ఓ ల్యాప్ టాప్ దొంగిలించినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

TAGS