CSK Vs PBKS : ధర్మశాలలో చెన్నై, పంజాబ్ కీలక పోరు
CSK Vs PBKS : ధర్మశాలలో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య కీలక పోరు జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు మొదటి మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం కానుంది. పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు 10 మ్యాచులు ఆడి 4 నాలుగు గెలవగా.. చెన్నై 10 మ్యాచులు ఆడి అయిదింట్లో విజయం సాధించి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతుంది.
చెన్నై, పంజాబ్ ఇప్పటి వరకు 29 సార్లు తలపడగా.. 15-14 గా చెన్నై లీడ్ లో ఉంది. కానీ గత అయిదు సార్లు జరిగిన మ్యాచుల్లో మాత్రం పంజాబ్ గెలిచి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ధర్మశాల పిచ్ పేస్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండగా.. కొత్త బంతితో బౌలర్లు చెలరేగవచ్చు. మంచి ఫేస్ లభిస్తుంది. ధర్మశాల పిచ్ లోనే దోని రిమార్కబుల్ ఇన్సింగ్స్ ఆడి చెన్నైను ప్లే ఆప్స్ చేర్చడమే కాకుండా 2010 లో టైటిల్ విజేతగా నిలిపాడు. అందుకే దోనికి ఇది స్పెషల్ వెన్యూ అని అంటుంటారు.
పంజాబ్ కింగ్స్ కు ఇంకా నాలుగు మ్యాచులు ఉన్నాయి. నాలుగింట్లో గనక గెలిస్తే ప్లే ఆప్స్ కు ఈజీగా చేరుకునే అవకాశం ఉంది. కానీ ఒక్క దాంట్లో ఓడిపోయినా దాదాపు దారులు మూసుకుపోతాయి. పంజాబ్ లో శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ ఇద్దరు బీభత్సమైన ఫామ్ లో ఉన్నారు. సీనియర్ ప్లేయర్లందరు చేతులెత్తేస్తున్న వేళ జట్టును తమ భుజస్కందాలపై మోస్తున్నారు.
దీపక్ చాహర్ గాయం కారణంగా ఈ టోర్నీలో మిగతా మ్యాచ్ లకు దూరమయ్యాడు. మతీషా పతిరణ మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఏకానమీ తక్కువగా ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్స్ టేబుల్స్ లో ప్రస్తుతం అయిదో స్థానంలో కొనసాగుతుండగా.. పంజాబ్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే చెన్నై మూడో స్థానానికి చేరుకుంటుంది. పంజాబ్ కూడా తన పాయింట్లను మెరుగు పర్చుకుని ప్లే ఆప్ రేసులో నిలుస్తుంది.