Andhra Pradesh : ఇక్కడ చట్టం ఎవరికీ చుట్టం అయ్యింది

Andhra Pradesh

Andhra Pradesh

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో 2019 లో అసెంబ్లీకి ఎన్నికలు జరగడానికి కొద్దిరోజుల ముందు వివేకానంద రెడ్డి హత్య జరిగింది.అప్పుడు జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఎలాగయినా అధికారం దక్కించుకోవాలనే తలంపుతో అప్పటి ముఖ్యమంత్రి హత్యకు ప్రధాన కారకుడంటూ పసలేని ఉపన్యాసాలు ఇస్తూ ప్రజల్లోకి వెళ్ళాడు.చంద్రబాబును గద్దె దించి తాను అధికారం దక్కించుకోవాలనే తలంపుతో తన చేతిలో ఉన్న మీడియాను సైతం పావుగా వాడుకొన్నాడు.హత్యకు కారణాలు ఏమైనా కావచ్చు. ఆ హత్య ప్రచారంతోపాటు జగన్ మీద కోడి కత్తి తో దాడి చేసిన సంఘటన మరొకటి కావడం విశేషం. ఆ ఎన్నికల్లో జగన్ ను అడ్డుకోవడం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సాధ్యం కాలేదు.చేసిన ప్రయత్నాలు సైతం చంద్రబాబుకు బెడిసికొట్టాయి.

వివేకా హత్య కేసు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయానికి అనుకూలంగా మారింది. కూటమిగా ఏర్పడిన బీజేపీ,జనసేన,టిడిపి పార్టీలతోపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సైతం వివేకా హత్య కేసుతో జగన్ ను అష్టదిగ్బంధం చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.బాబాయ్ వివేకాను హత్యచేసి బాహాటంగా తిరుగుతున్నాడు. జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నది సీఎం జగన్.అంతేకాదు హత్యచేసిన వ్యక్తిని కాపాడటమే కాకుండా కడప ఎంపీ అభ్యర్థిగా నిలిపాడు సీఎం అంటూ షర్మిల విస్తృత ప్రచారం చేస్తోంది. అంతేకాదు అవినాష్ ను రాజకీయంగా దెబ్బతీయడానికి కడప నుంచే షర్మిల కూడా బరిలో నిలిచారు. వివేకా ను ఎవరు చంపారంటూ చంద్రబాబుతోపాటు,జనసేన అధినేత పవన్, టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా ప్రశ్నిస్తూ ఓటర్ల వద్దకు వెళ్లడంతో జగన్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైనది.

ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా హత్య గురించి ఎవరు కూడా మాట్లాడరాదంటూ కడప కోర్ట్ ఉత్తర్వులు జారీచేసింది. కోర్ట్ ఆదేశాలు వచ్చేవరకు వివేకా హత్య కేసును ప్రధాన పార్టీలు అవకాశంగా తీసుకొని జగన్ ఇరుకున పెట్టడానికి ప్రయత్నించాయి.కానీ కడప కోర్ట్ నుంచి ఆదేశాలు రావడంతో ప్రతిపక్షాల నోటికి విషయం కరువైపోయింది.నిద్ర లేచింది మొదలుకొని మల్లి నిద్ర పోయేవరకు చంద్రబాబు ఎక్కడ దొరుకుతాడో అంటూ ఎదురుచూసేది జగన్. కోర్ట్ తీర్పులను కూడా బాబుకు మనగా చేసే సత్తా ఉందని జగన్ ప్రచారం చేసేది.సంస్థలను కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా తయారుచేసుకున్నాడని జగన్ ఆరోపించేది.చట్టాలను,స్వచ్చంద సంస్థలను,న్యాయ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నాడని ఆరోపణలు చేసే జగన్ ఇప్పుడు వివేకా హత్య పై ఎవరు మాట్లాడరాదంటూ కడప కోర్ట్ ఆదేశాలు ఇవ్వడం వెనుక ఎవరు వ్యవస్థలను తనకు అనుకూలంగా ఉంచుకున్నారో స్పష్టంచేయగలరా ??? ఏది సత్యం,ఏది అసత్యం అనేది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలే గుర్తించాలి.

TAGS