Chandrababu Bail : స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై మరికాసేపట్లో తీర్పు రానుంది. దీంతో ఏపీ వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు తీర్పును రిజర్వ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు తీర్పు వెలువరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మలపాటి శ్రీనివాస్ , సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ కేసులో తమ వాదనలు వినిపించారు. అ యితే ప్రభుత్వ పెద్ద లు చెప్పినట్లు సీఐడీ నడుచుకుంటున్నదని సీనియర్ న్యాయవాదులు తమ వాదనను వినిపించారు. కేవలం కక్ష సాధింపు ధోరణితోనే ఈ కేసును నమోదు చేశారని పేర్కొన్నారు. అదనపు ఏజీ పొన్నవోలు తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
ఇక సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదన లు వినిపించారు. ముందస్తు బెయిల్ నిబంధనలు పిటిషనర్ అతిక్రమించారని పేర్కొన్నారు. నిందితుడికి బెయిల్ మంజూరు చేయవద్దంటూ కోరారు. చంద్రబాబుకు ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలి. మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబు రోడ్ షో నిర్వహించి, కోర్టుషరతులను ఉల్లంఘించారు.
తెలంగాణలో అక్కడి పోలీసులు కూడా కేసు నమోదు చేశారంటూ వాదించారు. బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలని కోరారు. అయితే ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. కాగా నేటి మధ్యాహ్నం 2 గంటలకు తీర్పు వెలువరించేందుకు సిద్ధమవుతున్నది. దీనిపై టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.