Malala Yousafzai : బ్రిటీష్ టీవీ షోలో.. తళుక్కుమన్న మలాలా యూసఫ్ జాయ్

Malala Yousafzai

Malala Yousafzai

Malala Yousafzai : పిన్న వయసులో నోబెల్ బహుమతి పొందిన పాకిస్థాన్ కు చెందిన మలాలా యూసఫ్ జాయ్ ఓ టీవీ షోలో తళుక్కుమన్నారు. ‘వి ఆర్ లేడీ పార్ట్స్’ సెకండ్ సీజన్ లో ఆమె అతిథి పాత్రలో మెరవనున్నారు. కౌబాయ్ టోపీని ధరించి హార్స్ రైడ్ చేస్తున్నట్లుగా ఉన్న మలాలా ఫస్ట్ లుక్ ని షో నిర్వాహకులు రిలీజ్ చేశారు. మలాలా లుక్ నెట్టింట వైరల్ గా మారింది. మ్యూజిక్ బ్యాండ్ సభ్యులు తొలి ఆల్బం రిలీజ్ చేయడానికి పడిన కష్టం చుట్టే ఈ కథంతా తిరుగుతుంది. మ్యూజిక్ బ్యాండ్ కష్టాలను ఎత్తిచూపుతూ ‘మలాలా మేడ్ మీ డూ ఇట్’ అనే పాటను చిత్రీకరించారు. ఆ పాటలో మలాలా అతిథి పాత్రలో మెరవనున్నారు.

వీడియోలో బ్యాండ్ లో పాట పాడే ఓ మహిళ కుమార్తె తన గురువుపై గుడ్లు విసురుతుంది. దీంతో ఎందుకలా చేశావని తల్లి ప్రశ్నించగా మలాలా ఏమి చేస్తుందో అదే చేస్తున్నానంటూ ఆమె బదులిస్తుంది. మలాలా ప్రతిరోజూ బాలికల విద్య కోసం పోరాడుతుంది. ఇలా గుడ్లు విసరదని చెబుతున్న సమయంలో బ్యాండ్ ‘మలాలా మేడ్ మీ డూ ఇట్’ పాటను ప్రదర్శిస్తుంది.

TAGS