‘ఓ కుటుంబ వివాదం పరిష్కరించాలని అడిషనల్ ఎస్పీ తిరుపతన్నను కలిశా. ఆయన మా సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పరిష్కరించాం. నేను ఇచ్చిన 2 నెంబర్లు ట్యాపింగ్ అయినట్లు పోలీసులకు తెలిపాను. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పా. ఎప్పుడు పిలిచినా వస్తానని, ఇది పొలిటికల్‌కు సంబంధం లేదు’ అని జైపాల్ స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు కేవలం పోలీస్ ఆఫీసర్ల ప్రమేయంపై విచారణ జరిగింది. ఇప్పుడు పొలిటికల్ లీడర్ల ప్రమేయంపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. రెండు రోజుల క్రితం మరో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే లింగయ్యకు నోటీసులు అందాయి. రెండు గంటల పాటు అతన్ని విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఇప్పుడు జైపాల్ యాదవ్ హాజరయ్యారు. ఐవోగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పటి వరకు జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న నిందితులు భుజంగరావు, రాధా కిషన్‌తో మాజీ ఎమ్మెల్యే టచ్‌లో ఉన్నారని పోలీసులు గుర్తించారు.
ట్యాపింగ్ వ్యవహారంలో జైపాల్ పాత్రపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ కేసులో మాజీ ఎమ్మెల్యేలను నిందితులుగా చేరుస్తారా..? సాక్షులుగా పెడతారా.? అనేది సస్పెన్స్‌గా మారింది. బీఆర్‌ఎస్‌లో కీలక నేతలకు కూడా ఒకటి, రెండు రోజుల్లో నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. కేసులో అరెస్టయిన అధికారులతో మాజీ ఎమ్మెల్యేలకు సంబంధాలున్నాయని, ఎన్నికల సమయంలో కొందరి నెంబర్ అధికారులకు పంపి వాళ్ల ఫోన్ ట్యాప్ చేయించారనే అభియోగాలతో మాజీ ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు.