AP High Court : 22 నెలలు చంద్రబాబు బయటే ఉన్నారు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
AP High Court : స్కిల్ స్కాం కేసులో అరెస్ట్, 50 రోజులకు పైగా జైలు జీవితం గడిపిన చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు మూడు వారాల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ ను ఆయన అనారోగ్య కారణాల దృష్ట్యా కోర్టు ఇచ్చింది. ఈ నిబంధనల ప్రకారం.. చంద్రబాబు నాయుడు కేవలం హాస్పిటల్ లేదంటే ఇంట్లో మాత్రమే ఉండాలి. సాక్షులను ప్రలోభాలకు గురి చేసే పనులు చేపట్టవద్దు. ఎలాంటి రాజకీయ, పార్టీ సభలు, సమావేశాలు నిర్వహించవద్దు అంటూ షరతులు విధించింది.
అయితే హై కోర్టు విధించిన గడువు ఈ నెల 28వ తేదీతో ముగుస్తుంది. దీని నేపథ్యంలో ఇటీవల చంద్రబాబు మరోసారి తన బెయిల్ పిటీషన్ ను మూవ్ చేశారు. పిటీషన్ ను స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం ఈ రోజు (నవంబర్ 20) బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో ఆయన ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన పని లేదని న్యాయమూర్తి మల్లికార్జున్ రావు తీర్పు చెప్పారు. అయితే ఈ నెల 30వ తేదీన ఏసీబీ కోర్టు ఎదుట చంద్రబాబు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన నివేధికను ఏసీబీ కోర్టులో అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు.
హైకోర్టులో బెయిల్ పిటీషన్ పై విచారణ సందర్భంగా పలు కీలక అంశాలను హైకోర్టు గుర్తించింది.. ఆ అంశాలు ఏంటంటే..?
– కొద్దిరోజుల ముందే కేసు నమోదు చేసి అరెస్టు చేశారన్న హైకోర్టు
– విచారణ కాలంలో కేసును ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారం లేదన్న హైకోర్టు
– చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరిలో ఎన్ఎస్‌జీ భద్రతలో ఉన్నారన్న హైకోర్టు
– కేసు విచారణ నుంచి చంద్రబాబు తప్పించుకునే అవకాశం లేదన్న హైకోర్టు
– కేసు విచారణకు చంద్రబాబు విఘాతం కలిగించే అవకాశం లేదు
– సీమెన్స్ డైరెక్టర్, డిజైన్ టెక్ యజమాని వాట్సప్ సందేశాలకు, చంద్రబాబుకు సంబంధం ఏంటని ప్రశ్నించిన హైకోర్టు
– సీమెన్స్ తో ఒప్పందంలో సుమన్ బోస్ పేరుతో సంతకం ఉందని ప్రాసిక్యూషన్ వాదన – సంతకాలు పరిశీలించే బాధ్యత సీఎంది కాదన్న హైకోర్టు
– సంతకంపై అభ్యంతరాలుంటే ఫోరెన్సిక్ విభాగం తేలుస్తుందన్న హైకోర్టు
– గత ప్రభుత్వ హయాంలోనే అక్రమ లావాదేవీలు జరిగాయనేందుకు ఆధారాలు లేవన్న హైకోర్టు
– ఐటీశాఖ విచారణలో చంద్రబాబు పాత్ర ఉందన్న వాదనలకు ఆధారాలు లేవన్న కోర్టు