KKR Vs MI : కోల్ కతా నైట్ రైడర్స్.. ముంబయి ఇండియన్స్ కు కీలక మ్యాచ్

KKR Vs MI

KKR Vs MI

KKR Vs MI : ముంబయి ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ముంబయిలోని వాంఖడే లో ఈ సీజన్ లో 51 మ్యాచ్ శుక్రవారం సాయంత్రం జరగనుంది. ఇప్పటి వరకు 10 మ్యాచులు ఆడిన ముంబయి కేవలం 3 మ్యాచుల్లోనే గెలిచి పాయింట్స్ టేబుల్స్ లో 9 వ స్థానంలో ఉండగా.. కోల్ కతా నైట్ రైడర్స్ తొమ్మిది మ్యాచులు ఆడి మూడు ఓడిపోయి ఆరు గెలిచి 12 పాయింట్లతో మెరుగైన రన్ రేట్ తో రెండో స్థానంలో కొనసాగుతుంది.

కోల్ కతా ఓపెనర్లు ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ భీకర ఫామ్ లో ఉన్నారు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతుండడంతో కోల్ కతాకు పెద్దగా ఇబ్బందులు రావడం లేదు. శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ లో ఫామ్ లోకి రావాలి. మిడిలార్దర్ బ్యాట్స్ మెన్ రాణించకపోతే కీలక సమయాల్లో కష్టమయ్యే అవకాశం ఉంది. బౌలింగ్ లో కూడా సునీల్ నరైన్ తక్కువ పరుగులు ఇస్తూ ఇతర టీంల బ్యాట్స్ మెన్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.

ముంబయి ఇండియన్స్ కథ వేరేలా ఉంది. ఎప్పుడూ ముంబయికి మొదటి మ్యాచ్ ఓడిపోవడం నుంచి కోలుకుని తిరిగి కప్ కొట్టే వరకు విశ్రమించేది కాదు. కానీ ఈ సీజన్ లో పది మ్యాచుల్లో మూడు మాత్రమే గెలిచి మిగతావి అన్ని ఓడిపోయింది. పాయింట్స్ టేబుల్స్ లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, హర్దిక్ పాండ్యా, సూర్య అందరూ ఫామ్ కోల్పోయారు. ఒక్క బుమ్రా మినహా ఎవరూ సరిగా బౌలింగ్ వేయడం లేదు. దీంతో ముంబయి వరుస మ్యాచుల్లో ఓడిపోతుంది.

హర్దిక్ పాండ్యా బౌలింగ్ లో కూడా రాణించడం లేదు. ముంబయి ఇండియన్స్ కు ఇంకా నాలుగు మ్యాచులు ఉన్నాయి. మిగతా నాలుగు మ్యాచులు గెలిస్తే ఏమైనా జట్ల పాయింట్ల తో సమమైతే తప్ప ముంబయి ప్లే ఆప్స్ చేరడం కష్టం.

TAGS