UAE : ప్రయాణీకులకు యుఎఈలోని భారత ఎంబసీ కీలక సూచనలు
UAE : యుఎఈలోని భారత ఎంబసీ కార్యాలయం భారత ప్రయాణికులకు పలు కీలక సూచనలు చేసింది. దుబాయ్ కు వెళ్లేవారు, లేదా దుబాయ్ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు అత్యవసరం కాని పక్షంలో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. యుఎఈలో వర్ష బీభత్సం నెలకొన్న దృష్ట్యా అక్కడ పరిస్థితులు చక్కబడేంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, తమ సూచనలను పాటించాలని కోరింది. అవసరమైనవారికి సహాయం కోసం దుబాయ్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు భారత ఎంబసీ కార్యాలయం పేర్కొంది.
ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుని జనజీవనం పూర్తిగా స్తంభించింది. కొన్ని గంటలు కురిసిన వానతో ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం నమోదయింది.