Ration card : రేషన్ కార్డుదారులకు ముఖ్యమైన ప్రకటన

Ration card
Ration card : రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీలోగా తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ ఆదేశించారు. ఈ ప్రక్రియ గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్ యాప్ లేదా రేషన్ షాపులలోని ఈ పాస్ పరికరాల ద్వారా చేసుకోవచ్చు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మినహా, అర్హులైన ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువులోగా ఈకేవైసీ పూర్తి చేయాలని, లేని పక్షంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని కమిషనర్ హెచ్చరించారు.