Rahul Gandhi : దేశ వ్యాప్తంగా ఆరు గ్యారంటీలు అమలు – నిర్మల్ లో రాహుల్ గాంధీ

Rahul Gandhi
Rahul Gandhi : ఈరోజు నిర్మల్ లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. దేశంలోని ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించిందిన అన్నారు. మన రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బీజేపీ అంటోందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని, ఇది దేశ ముఖచిత్రాన్ని మారుస్తుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ధనికుల కోసమే మోదీ పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ధనవంతులకు రూ. 16 లక్షల కోట్లు రుణ మాఫీ చేశారని తెలిపారు. తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని, కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను పెంచుతామని రాహుల్ గాంధీ చెప్పారు.