IMDb Rating : ఐఎండిబి రేటింగ్ ఇస్తే ఆ సినిమా చూడాల్సిందే
అయితే చాలామంది ప్రత్యేకంగా రివ్యూలు రాస్తూ ఉంటారు. ఒక్కో సినిమాకు ఒక్కో రకమైన రివ్యూ ఇస్తూ దానిని హిట్టు లేదా ఫెయిల్ చేసేందుకు అవకాశం ఉంది. కానీ అభిమానికి నచ్చేలా అభిమాని మెచ్చేలా రివ్యూ అనేది ఉండడం లేదు. రివ్యూలు వ్యక్తిగతంగా ఎక్కువగా తీసుకుంటున్నారు. సినిమాలో ఉన్న కంటెంట్ అందులోని క్యారెక్టర్లు కథని విశ్లేషణాత్మకంగా వివరించడం లేదు.
అయితే ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ ఐఎండిబి మాత్రం తన రేటింగ్ తో వచ్చే సినిమాలు కచ్చితంగా సక్సెస్ఫుల్ అని తెలుస్తున్నాయి. ఐఎండిబి అనగానే ఒక విశ్వసనీయమైనటువంటి రేటింగ్ ఇచ్చే సంస్థగా తెలుస్తోంది. ఈ ఇంటర్నేషనల్ సినిమా డేటా బేస్ కు సంబంధించి సోషల్ మీడియాలో గాని ఇతర ఇంటర్నెట్లో గాని సినిమా చూసిన ప్రేక్షకులు ఇచ్చే రివ్యూల ఆధారంగా అన్నింటినీ కలుపుకొని ఇది ఒక రేటింగ్ ఇస్తుంది. అంటే సినిమాకు రివ్యూ తర్వాత కచ్చితంగా రేటింగ్ ఇస్తారు.
అలాంటి రేటింగ్ లో ఐఎండిబి ఇచ్చే రేటింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రేటింగ్ ఖచ్చితమైన ప్రామాణికమైన విశ్వసనీయమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉంది. ఐఎండిబి తాజాగా ఒక ఐదు సినిమాలకు టాప్ రేటింగ్ ఇచ్చింది. కేరళలో పొలిటికల్ డ్రామా మధ్య నడిచే సినిమా సందేశానికి 9.0 రేటింగ్ ఇవ్వగా బాలీవుడ్ లో తాజాగా వచ్చిన 12 ఫెయిల్ సినిమాకు 8.9 రేటింగ్ తెలుగులో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం సినిమాకు 8.8 రేటింగ్ ఇచ్చింది. అలా మరో మూడు సినిమాలకు 8.7 రేటింగ్ ఇస్తూ చెప్పింది. ఈ సినిమాలు నిజంగానే మంచి రేటింగ్ ని పొందడంతో పాటు కథనం బలం గా ఉన్న చిత్రాలు అని నిరూపితమయ్యాయి.