JAISW News Telugu

Poonam Pandey : నేను చనిపోలేదు..బ్రతికే ఉన్నాను – పూనమ్ పాండే

FacebookXLinkedinWhatsapp

 

Poonam Pandey  : ప్రముఖ బాలీవుడ్ నటి పూనమ్ పాండే నిన్న ఉదయం కర్వికల్ క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది అనే వార్త ఆమె అభిమానులను ఏ రేంజ్ లో బాధపెట్టిందో మనమంతా చూసాము. అసలు ఆమె ఎలా చనిపోతుంది..?, నిన్న మొన్నటి వరకు కూడా ఎంతో ఆరోగ్యంగా కనిపించింది. ముఖం లో రోగం వచ్చినట్టు అసలు అనిపించలేదు, ఎలా జరిగిందబ్బా అని ఎంతో బాధపడ్డారు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థనలు కూడా చేసారు.

అంతే కాకుండా ఆమె దగ్గర 11 ఏళ్ళ పాటు బాడీ గార్డ్ గా పని చేసిన వ్యక్తి కూడా పూనమ్ చనిపోయింది అంటే నేను అసలు నమ్మను, ఆమె బ్రతికే ఉంది. ఆమె విషయం కనుక్కుందాం అని నిన్నటి నుండి ఆమె కుటుంబ సభ్యులను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాను. కానీ ఎవ్వరూ కూడా నా ఫోన్ కాల్స్ ని లిఫ్ట్ చెయ్యలేదు. వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చే వరకు ఎదురు చూద్దాం, పూనమ్ పాండే మాత్రం చనిపోయింది అంటే నేను నమ్మను అంటూ ఎంతో బలంగా చెప్పాడు.

అతను చెప్పినట్టుగానే పూనమ్ పాండే చనిపోలేదు. ఈరోజు ఆమె ఇంస్టాగ్రామ్ లో నేను బ్రతికే ఉన్నాను అంటూ అప్లోడ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘ మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను బ్రతికే ఉన్నాను, ఎంతో ఆరోగ్యం గా కూడా ఉన్నాను.  గర్భాశయ క్యాన్సర్ నన్ను ఏమి చెయ్యలేదు, కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవటం వల్ల వేలాది మంది మహిళలలు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా, గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించదగినది. HPV వ్యాక్సిన్ మరియు ముందస్తుగా గుర్తించే పరీక్షలతోనే దీనిని  నివారించవచ్చు. ఈ వ్యాధితో ఎవరూ తమ ప్రాణాలను కోల్పోకుండా చూసుకునే మార్గాలు మా వద్ద ఉన్నాయి.

స్పష్టమైన అవగాహనతో ఒకరినొకరు బలపర్చుకుందాం, ప్రతి మహిళ తీసుకోవలసిన చర్యల గురించి మేము తెలియచేస్తాం. ఈ క్యాన్సర్ నుండి బయటపడడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నా బయో లో లింక్ ని అప్లోడ్ చేశాను చూడండి. అందరం సమిష్టిగా కృషి చేసి ఈ వ్యాధిని సమూలంగా నివారించేందుకు కృషి చేద్దాం’ అంటూ ఆమె ఒక వీడియో అప్లోడ్ చేసింది. దీంతో ఈమె క్షేమంగా ఉండనే విషయం తెలుసుకొని కొంతమంది నెటిజెన్స్ సంతోషపడగా, మరికొంత మంది నెటిజెన్స్ మాత్రం బండ బూతులు తిడుతున్నారు.

Exit mobile version