Illegal construction : చెరువులో అక్రమ నిర్మాణం.. బాంబులతో కూల్చివేత

Illegal construction
Illegal construction : చెరువులో అక్రమంగా నిర్మంచిన భారీ భవనాన్ని అధికారులు కూల్చివేశారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మధిర గ్రామం కుతుబ్ శాయి పేట్ గ్రామంలో రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు అక్రమంగా నిర్మించిన భారీ భవనాన్ని గుర్తించారు. కొంతమంది వ్యక్తులు చెరువులోనే బహుళ అంతస్తుల భవనం కట్టడంతో దానిని కూల్చివేయడానికి చర్యలు తీసుకున్నారు. బాంబుల ద్వారా ఆ అక్రమ భవనాన్ని నేలమట్టం చేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరి పడడంతో ఇద్దరికి గాయాలయ్యాయి.
సికింద్రాబాద్ కు చెందిన వ్యక్తి 12 ఏండ్ల కిందట మల్కాపురం పెద్దచకెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో ఈ భవనాన్ని నిర్మించారు. నీళ్లలో అడుగుపెట్టకుండా లోపలికి వెళ్లడానికి కొంత దూరం నుంచే మెట్లు కట్టారు. యజమాని కుటుంబ సభ్యులు వారాంతంలో ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటారు.