Manjummel Boys : ఇళయరాజా లీగల్ నోటీసులు.. స్పందించిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ నిర్మాత
Manjummel Boys : మలయాళ బ్లాక్ బస్టర్ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’ నిర్మాతలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. ఈ సినిమాలో ‘గుణ’ చిత్రం కోసం ఇళయరాజా స్వర పరిచిన ‘కమ్మని ఈ ప్రేమ లేఖలే’ పాటను వాడారు. అనుమతి తీసుకోకుండా, రాయల్టీ ఫీజు చెల్లించకుండా ఇలా పాటను ఉపయోగించడం కాపీరైట్ చట్టాన్ని అతిక్రమించినట్లేనని ఇళయరాజా న్యాయవాది శరవణన్ అన్నాదురై నిర్మాతలకు పంపించిన నోటీసులో హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత షాన్ ఆంటోనీ స్పందించారు. ఓ న్యూస్ పోర్టల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాపీరైట్ కలిగిన రెండు మ్యూజిక్ కంపెనీలను సంప్రదించి వారి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే పాటను వాడామని స్పష్టత ఇచ్చారు.
TAGS Ilaiyaraaja Songsilaiyaraaja-Manjummel BoysIlaiyraajaIlaiyraaja legal noticesManjummel BoysManjummel Boys Producer