Ilaiyraaja : ‘మంజుమ్మెల్ బాయ్స్’కు ఇళయరాజా లీగల్ నోటీస్.. ఎందుకంటే?

Ilaiyaraaja

Ilaiyaraaja-Manjummel Boys

Ilaiyaraaja : భారతీయ సంగీత ప్రపంచంలో ఇళయరాజా ఓ పేజీని క్రియేట్ చేసుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన పేరు చెప్తే చాలు అద్భుతమైన సంగీతం, మంచి మంచి పాటలు మనసులో మెదలుతాయి. ఇదంతా ఒక ఎత్తయితే ఆయన వచ్చినప్పటి నుంచే కేసులు కూడా పెరిగిపోయాయి. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అయినా, రేడియో అయినా, ఇలా ఏ మాధ్యమంలో అయినా ఆయన పాట ప్లే అయితే చాలు కేసులు పెట్టడం, కోర్టుకు ఎక్కడం పరిపాటిగా మారింది. రీసెంట్ గా వచ్చిన ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాలో ఆయన సినిమా గుణ నుంచి తీసుకున్న సాంగ్ విషయంలో ఆయన కేసు ఫైల్ చేశారు.

ఇళయరాజా పాట ‘వావా పక్కం వా’లో కొంత భాగంను రజనీకాంత్ కూలి సినిమా టీజర్ లో వాడినందుకు ఇళయరాజా ఆ సినిమా నిర్మాతలకు లీగల్ నోటీసు పంపాడు. ఈ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. మళ్లీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసిన మలయాళ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్‌పై కాపీరైట్ దాఖలు చేశారు.

గుణ చిత్రం కోసం తాను కంపోజ్ చేసిన ‘కన్మణి అన్బోడు కాదలన్’ పాటను తన అనుమతి లేకుండా ‘మంజుమ్మెల్ బాయ్స్‌’లో ఉపయోగించారని ఇళయరాజా పేర్కొన్నారు. ఇళయరాజా ఈ పాట యొక్క అసలైన స్వరకర్త అని దీన్ని అనధికారికంగా ఉపయోగించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

15 రోజుల్లో పరిహారం ఇవ్వాలని ఇళయరాజా డిమాండ్ చేశారు. పర్మిషన్ తీసుకోవాలని, లేదంటే పాటను తొలగించాలని సూచించారు. 15 రోజుల్లోగా పరిహారం చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లాయర్ నోటీసులో పేర్కొన్నారు.

మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలు 1991లో విడుదలైన గుణ చిత్రానికి మధ్య ఉన్న సంబంధాన్ని చిత్రీకరించేందుకు ఈ పాటను ఉపయోగించారని గమనించడం ఆసక్తికరంగా మారింది. ఈ పాట కొడైకెనాల్‌లోని గుహల సెట్ సమీపంలో చిత్రీకరించబడింది. ఇది తర్వాత తెలిసింది. గుణ గుహలుగా. గుణ గుహల వద్ద స్నేహితుల బృందం యొక్క దురదృష్టాల చుట్టూ మంజుమ్మెల్ బాయ్స్ కేంద్రీకృతమై ఉంది.

TAGS