Brahmanandam : బ్రహ్మానందం, బాబు మోహన్ , కోట శ్రీనివాసరావుల మధ్య విభేదాలకు కారణం ఇదే
Brahmanandam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాస్య నటులకు ఉన్నంత ప్రాధాన్యం వేరే ఏ ఇండస్ట్రీలో ఉండదు. తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా హాస్యం ఇష్టపడతారని అందరికీ తెలిసిన విషయమే.అలా ప్రేక్షకులు హీరోలు హీరోయిన్లనే కాకుండా హాస్య నటులను కూడా అక్కున చేర్చుకున్నారు.
రేలంగి, రాజబాబు, రమ ప్రభ,అల్లు రామలింగయ్య, రావు గోపాల్ రావు ఈ కాంబినేషన్లో అనేక మూవీలను తీశారు. వీరి కోసం ప్రత్యేకంగా సీన్లను కూడా డైరెక్టర్లు రాయించేవారని తద్వారా ఆ సినిమాకే హైలైట్ గా నిలిచేవారు. అయితే అనంతరం కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబినేషన్ అద్భుతంగా పండింది. మామగారు సినిమాలో వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సీన్లు ప్రేక్షకులను అలరించాయి.
ఇప్పటికీ యూట్యూబ్లో వీరి సీన్లను చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు . మామగారు సినిమా తర్వాత కోట శ్రీనివాసరావు బాబు మోహన్ కలిసి ఉండే వారు. బ్రహ్మానందం కోటా శ్రీనివాసరావుకు పడదని ఆ మధ్య గొడవలు అయ్యాయని పుకార్లు వినిపించాయి. కానీ ఇది నిజమని ఒక ఇంటర్వ్యూలో వారే చెప్పారు.
కోట శ్రీనివాసరావు బాబు మోహన్ ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బ్రహ్మానందంతో మీకు పడదట కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఒక ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు అన్నదమ్ములకు భార్య భర్తలకే మనస్పర్ధలు వస్తుంటాయి. అలాంటిది మేము సెట్ లో యాక్టింగ్ చేసే యాక్టర్లు మాత్రమే అభిప్రాయ బేధాలు రావడం అనేది సహజం అని అన్నారు.
దీంతో బ్రహ్మానందం కోట శ్రీనివాసరావు బాబుమోహన్ మధ్య ఉన్నటువంటి విభేదాలు బహిరంగమయ్యాయి.తెలుగు ప్రేక్షకులు ఎవరికి ఇవ్వాల్సిన ప్రయారిటీ వాళ్లకు ఇస్తూనే ఉంటారు. ఎవరినీ కించపరచడం కానీ ఎవరిని తక్కువ చేసి చూడడం గాని చేయరు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో హాస్య నటులు అంటే అంతటి ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఎప్పటికీ తెలుగు సినిమా ఉన్న నాలుగు గుర్తుండిపోతారు.