
CM Chandrababu
CM Chandrababu : నాలుగోసారి ఏపీ సీఎంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబులో మార్పు కనిపిస్తోంది. తాడేపల్లిలో పెనుమాకలో తానే స్వయంగా ఇంటింటికీ వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలన్న నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన చంద్రబాబు ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు సామాన్య ప్రజలను కలిసిన ప్రజలను కలిసిన సంగతి తెలిసిందే. అయితే, బాబును కలిసేందుకు పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా టోల్ ఫ్రీ నంబర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇకపై చంద్రబాబును కలిసి సమస్యలు విన్నవించుకోవాలని అనుకునేవారు ముందుగా టోల్ ఫ్రీ నంబర్ 73062 99999 కు కాల్ చేసి వారి సమయాను చెప్పాలని, ఆ తర్వాత సమస్య తీవ్రతను, ప్రాధాన్యతను బట్టి చంద్రబాబును కలిసేందుకు అనుమతిస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి వారి 500 మందికి చంద్రబాబును కలిసే అవకాశం కల్పిస్తామని తెలిపారు.