JAISW News Telugu

Botsa – Sajjala : ఉద్యోగాలు కావాలంటే పెట్టెలతో రావాలి.. సంచలనంగా బొత్స, సజ్జల వ్యాఖ్యలు

Botsa - Sajjala

Botsa Satyanaraya – Sajjala Ramakrishna

Botsa – Sajjala : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.  అధికారం చేతిలో ఉంది కదా అని గత ప్రభుత్వం చేసిన దారుణాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉద్యోగులకు సంబంధించిన సంచలన విషయం బయటకు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలోని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి..  మీ ఉద్యోగాలు దక్కాలంటే ఖాళీ చేతులతో కాదు..పెట్టెలు పట్టుకురావాలని డిమాండ్‌ చేశారని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ పీజీటీ(తెలుగు, ఇంగ్లీష్‌) ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ‘వైసీపీ ప్రభుత్వం నాది..ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వచ్చినా నా హవానే నడుస్తుంది. మీకు నచ్చినట్టు చేసుకోండి’ అంటూ సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు బెదిరించినట్లు వారు వాపోయారు. మహిళలని కూడా చూడకుండా నోటికి వచ్చినట్లు తమని దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు తెలిపి న్యాయం కోరేందుకు ఆదివారం వారు ఉండవల్లిలోని ఆయన నివాసం వద్దకు వచ్చారు. లోకేశ్‌ పీఏకు వారంతా కలిసి వినతిపత్రం సమర్పించారు.

అనంతరం అక్కడే వారు విలేకరులతో మాట్లాడారు. ‘2018-19 నోటిఫికేషన్‌ ద్వారా విధుల్లోకి తీసుకొన్న మమ్మలను హేతుబద్ధీకరణ పేరుతో గత ప్రభుత్వం తొలగించింది.  మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వైసీపీ పెద్దల్ని ఎంతమందిని కలిసినా.. లంచం డిమాండ్‌ చేశారే తప్ప..న్యాయం చేయలేదు. అసలు మీ రిక్రూట్ మెంటే తప్పు అని  సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు తిట్టారు. దీనిపై హై కోర్టుకు కూడా వెళ్లాం. మమ్మల్ని తొలగించడం న్యాయసమ్మతం కాదని హైకోర్టు చెప్పినా ఆయన కోర్టు మాటను కూడా పట్టించుకోలేదు. పైగా మాపై రిట్‌ పిటిషన్‌లు దాఖలు చేశారు. మమ్మల్ని నడిరోడ్డు మీద నిలిబెట్టారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ను కలిస్తే ‘మీరు నడిరోడ్డు మీద ఇళ్లు కట్టుకున్నారు.. వాటిని తొలగించారు’ అంటూ వెటకారంగా మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం హయాంలోనైనా న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో మంత్రి లోకేశ్‌ను కలవడానికి వచ్చాం’’ అంటూ బాధితులు లలిత, కామేశ్వరి చెప్పుకొచ్చారు.

Exit mobile version