JAISW News Telugu

Sunstroke : ఇంట్లో ఇక్కడ ఎక్కువ సేపు ఉంటే.. వడదెబ్బ సోకే ప్రమాదం ఉందట..!

Sunstroke

Sunstroke

Sunstroke : వేసవి వచ్చిందంటే చాలు ఎండ వేడిమితో ఉక్కిరి బిక్కిరి కావాల్సిందే. ఎన్ని చల్లని పాణియాలు తాగినా కూడా డీహైడ్రేషన్ భారిన పడుతూనే ఉంటాం. అందుకే వైద్యులు కూడా వేసవిలో తరుచూ నీటిని తీసుకుంటూ ఉండాలని హెచ్చరిస్తుంటారు. ఇక ఆరుబయటికి వెళ్లారా అంతే సంగతులు. వడదెబ్బ భారిన పడడం ఖాయం. అందుకే వైద్యులు కూడా వేసవిలో బయటి పనులు చేసుకునేవారు ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే, బయటకు వెళ్లకుండా ఇంట్లో కూడా వడదెబ్బ సోకుతుందట. అయితే ఆ ప్రదేశంలో ఉంటే సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సూచిస్తున్నారు. దాని గురించి తెలుసుకుందాం.

తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ ఆర్వీ కర్జన్‌.. కొన్ని సూచనలతో ఒక ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటా. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు మరింత జాగ్రత్తగా ఉండాలట. ఎండలో ఆరుబయట పని చేయడం,  ఆటలాడడం, చెప్పులు లేకుండా బయటకు వెళ్లడం లాంటివి చేయవద్దు.

వంటకు దూరంగా..
గృహిణులు, వంట చేసేవారు వేసవిలో ఉదయం మాత్రమే వంటగదిలో ఉండాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఎలాంటి వంటలు చేయవద్దు. వేడితో పాటు వంటగదిలో మంట వేడి కూడా పెరిగి వంట చేస్తున్న వారు డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉన్నా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతలు 40.5 సెంటిగ్రేడ్‌ కంటే ఎకువగా ఉన్నా, విపరీతమైన చెమట కారడం, దాహం వేయడం, బలహీనత, కండరాలు పట్టేయడం, తలతిప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. వేసవి ముగిసే వరకు మద్యం, కాఫీ, టీ, స్వీట్స్‌, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Exit mobile version