Sun Stroke : ఈ లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్లే.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది!

Sun Stroke

Sun Stroke

Sun Stroke : సమ్మర్ సీజన్ మొదలైంది. భానుడు భగభగమంటున్నాడు. దంచికొడుతున్న ఎండలను చూసి పిల్లలు, మహిళలు, వృద్ధులు భయపడిపోతున్నారు. బయటికెళ్లాలంటేనే వణికిపోతున్నారు. ఇక పనులు రీత్యా వెళ్లేవారికి తప్పదు కనుక వారి బాధలు వారు పడుతున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే రాబోయే రెండు నెలలు ఎండల తీవ్రత మరింత పెరుగుతుంది. వడగాలులు ఇబ్బంది పెడుతాయి. ఇక మధ్యాహ్నం వేళ అయితే అటు ఎండల ప్రతాపం, ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లిన వారికి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అలాంటి వారికి ఏ లక్షణాలు ఉంటాయో చూద్దాం..

వడదెబ్బ లక్షణాలు:

– వడదెబ్బ తగిలితే కళ్లు బైర్లు కమ్మడం, తల తిరిగినట్లు అనిపిస్తుంది.

– వడదెబ్బకు గురైన వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతారు. నాలుక తడారిపోతుంటుంది.

– గుండె వేగంగా కొట్టుకోవడం, దాహం తీవ్రంగా ఉంటుంది.

– వాంతులు, విరేచనాలు, అతిసారం బారిన పడుతుంటారు.

-తలనొప్పి, కొద్దిపాటి జ్వరం లక్షణాలు కనిపిస్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

– నీళ్లు ఎక్కువగా తాగాలి. బయట పనిచేసేవాళ్లు కొబ్బరినీళ్లు, జ్యూసులు, చల్లటి నీళ్లు తరుచుగా తాగాలి.

– ముదురు రంగు బట్టలు వేడిని గ్రహిస్తాయి. అందుకే లేత రంగు, తెలుపు రంగు బట్టలు ధరించాలి. బిగుతు బట్టల కంటే వదులుగా ఉండేవి వేసుకోవాలి.

– ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు తిరగకపోతేనే మంచిది.

– ఒకవేళ ఎండకు వెళ్లడం తప్పదు అనుకుంటే గొడుగు తీసుకెళ్లాలి. క్యాపులు ధరించాలి.

వడదెబ్బ సొకితే ఇలా చేయాలి:

-వడదెబ్బ సోకిన వారిని చల్లటి గాలి, వెలుతురు ధారళంగా వచ్చే గదిలో ఉంచాలి.

– నిమ్మరసం, మంచినీళ్లు, కొబ్బరినీళ్లు తరుచు అందించాలి. గ్లూకోజ్ లాంటివి కూడా అందించాలి.

– వారిని ప్రశాంతంగా ఉండనివ్వడంతో పాటు అవసరమైతే డాక్టర్ ను సంప్రదిస్తే మంచిది.

TAGS