Trisha Krishnan : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది నటి త్రిష కృష్ణన్. వయసును సైతం లెక్కచేయకుండా సినిమాల్లో లీడ్ హీరోయిన్ లేదా పవర్‌ఫుల్ సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే ఉంది. మునుపటి తరం హీరోయిన్ల కెరీర్ ను స్తంభింపజేసిన 40 ఏళ్ల వయసులో కూడా త్రిషకు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
ఆమె చేస్తున్న బ్యాక్ టు బ్యాక్ సినిమాల గురించే కాదు.. ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి కూడా ఇండియన్ ఫిల్మ్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది. సౌత్ ఇండియాలో ఒకే సినిమాకు రూ. 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ పారితోషికం తీసుకునే ఏకైక నటిగా త్రిష కృష్ణన్ నిలిచింది. తన తాజా చిత్రం కమల్ హాసన్ తో నటించిన ‘థగ్ లైఫ్’కు సంబంధించి త్రి రూ. 12 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ఒక దక్షిణాది నటి ఒకే సినిమాకు రూ.10 కోట్ల మార్కును దాటడం ఇదే తొలిసారి కావడంతో త్రిష ఈ ప్రాంతంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నిలిచింది.
సమీపం కాలం నటీమణులతో పోలిస్తే త్రిష పారితోషికం సౌత్ ఇండియాలోనే అత్యధికం. నయనతార, సమంత రూత్ ప్రభు వంటి ఇతర ప్రముఖ నటీమణులు కూడా రూ.8 నుంచి రూ. 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుండగా, త్రిష సంపాదన వారికంటే అగ్రగామిగా నిలిపింది.
చిత్ర పరిశ్రమలో త్రిష ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. 2010లో అక్షయ్ కుమార్ సరసన ‘ఖట్టా మీఠా’ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో, ఆమె తన కెరీర్ ను తమిళ, తెలుగు సినిమాల వైపు మళ్లించింది. అక్కడ గణనీయమైన విజయం దక్కింది.
వరుస పరాజయాలు ఎదురైనా దక్షిణాది చిత్రసీమలో అగ్ర కథానాయికగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది త్రిష. 40 ఏళ్ల వయసులో కూడా ఏటేటా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తూ స్లో అయ్యే సూచనలు కనిపించడం లేదు. పొన్నియిన్ సెల్వన్ (రెండు భాగాల్లో), లియో వంటి చిత్రాల్లో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద రూ .800 కోట్లకు పైగా సంపాదించాయి.
మున్ముందు త్రిష చేతిలో అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘థగ్ లైఫ్’తో పాటు అజిత్ కుమార్ సరసన విదా ముయార్చి, మోహన్ లాల్ సరసన రామ్, చిరంజీవి సరసన విశ్వంభర, టోవినో థామస్ సరసన ఐడెంటిటీ చిత్రాల్లో నటిస్తోంది. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో త్రిష తన టాలెంట్, వైవిధ్యంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.