JAISW News Telugu

CM Revanth warning : దొడ్డు బియ్యం, కుళ్లిన కూరగాయలు పెడితే.. జైలు కెళ్తారు : సీఎం రేవంత్ వార్నింగ్

CM Revanth warning

CM Revanth warning

CM Revanth warning : ఇటీవల ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరై మాట్లాడారు.  ఈ మధ్య తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నా.. విద్యార్థులు తినే ఆహారంలో కల్తీ.. విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు, బల్లులు వస్తున్నాయి.

ఇక నుంచి హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించకుంటే జైలుకు పంపుతా. గ్రీన్ ఛానల్ ద్వారా విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వాలి. విద్యార్థులకు అన్నంతో మంచి భోజనం పెట్టాలి. గురుకులాల విద్యార్థులకు ముఖ్యమంత్రి, మంత్రులు తినే సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. విద్యార్థులకు ఎక్కడైనా అన్నం, కుళ్లిన కూరగాయాల భోజనం పెడితే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

రాష్ట్రంలో 60 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని.. ఈ విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తు అన్నారు. కాబోయే ఇంజనీర్లు, డాక్టర్లు, ముఖ్యమంత్రులు ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రిని చూశారా? ఎల్బీ స్టేడియం తీసుకొచ్చి మీతో మాట్లాడారా..? ఈ ప్లాట్‌ఫారమ్‌లో మీ కళను ప్రదర్శించడానికి మీరు అవకాశం ఇచ్చారా? అయితే మీ రేవంత్ అన్న మిమ్మల్ని కలిశారు.. మీతోనే ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఫామ్‌హోస్‌లో నిద్రిస్తున్న కేసీఆర్‌కు చప్పట్లు కొట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థులకు సూచించారు.

Exit mobile version