viral : నిలదీస్తే బూతులా.. ఎమ్మెల్యే వీడియో వైరల్

viral : మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైనంపల్లి రోహిత్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా, ప్రజలు తమ సమస్యలు ఉల్లేఖిస్తూ రోహిత్‌ను ప్రశ్నించడంతో, ఆయన ఆగ్రహంతో సంస్కార మరచి బూతులు తిట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ, “కేసీఆర్ గాడు అందరి నెత్తిమీద రెండు లక్షల అప్పు చేసి ఎత్తుకొని వెళ్ళిపోయిండు,” అంటూ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాక, “నేను ఎవరికీ భయపడే వాడిని కాదు, కేసీఆర్ గాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే వాడికి ఉచ్చ పోయించినా,” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు తమ ప్రాథమిక అవసరాలపై నిలదీయడం పట్ల అసహనం వ్యక్తం చేసిన రోహిత్, వారిపై అనుచితమైన పదజాలంతో మాట్లాడిన తీరు తీవ్ర విమర్శలకు దారితీశాడు. ప్రజా ప్రతినిధిగా బాధ్యత గల స్థితిలో ఉండాల్సిన రోహిత్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం పట్ల రాజకీయ వర్గాలు, సామాన్య ప్రజానీకం మండిపడుతున్నారు.

సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజల సమస్యలు విని, పరిష్కరించే బాధ్యత ఉన్న వ్యక్తి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. యువ నాయకులు మర్యాదను, సంస్కారాన్ని పాటించాలని సూచిస్తున్నారు.

TAGS