Kamal Haasan : లోకనాయకుడు కమల్ హసన్ భారతీయుడు 2 సినిమా కోసం చాలా కష్టపడ్డట్లు తెలుస్తోంది. ఒక్క సారి మేకప్ వేసుకోవాలంటేనే మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టేదంటా. అయినా ఓపికగా ఉండి మేకప్ మొత్తం వేసుకునే వాడని అయితే ఆ తర్వాత సుమారు 6 గంటల పాటు అదే మేకప్ తో నటించేవాడని తెలుస్తోంది.
కమల్ హసన్ సినిమాల గురించి ఎంతలా కష్టపడతారో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా కమల్ హసన్ అనేక సినిమాల్లో తన క్యారెక్టర్ ఎలా ఉండాలో డైరెక్టర్ చెప్పిన విధానంపై బరువు తగ్గడం, పెరగడం లాంటివి చేసేవారు. క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేయడం కమల్ హసన్ కే సాధ్యం.
గతంలో దశావతారం సినిమాలో 10 క్యారెక్టర్లు ఒక్కడే వేసి రికార్డు సృష్టించాడు. ఇలా ఒక్కో క్యారెక్టర్ కోసం కమల్ హసన్ పడే కష్టం అంతా ఇంతా కాదని ఆయన్ని అభిమానించే ప్రేక్షకులందరికీ తెలుసు. కమల్ హసన్ ఆరు గంటలకు షూటింగ్ లో రెడీగా ఉండాలంటే మూడు గంటలకే వచ్చి మేకప్ వేయించుకునేందుకు సిద్ధంగా ఉండేవారంటా.. ఈ వయసులో కూడా అంతటి డెడికేషన్ కలిగిన నటుడు ఎవరూ ఉండని లోక నాయకుడిని చూస్తే అర్థమవుతుంది.
విజువల్ వండర్ గా తెరకెక్కబోతున్న భారతీయుడు 2 మూవీపై కమల్ హసన్ భారీగానే అంచనాలు పెట్టుకున్నాడు. ఈయనతో పాటు డైరెక్టర్ శంకర్ కూడా భారతీయుడు 2 మూవీ భారీ హిట్ సాధిస్తుందని భావిస్తున్నారు. కమల్ హసన్ కు చాలా రోజుల నుంచి ఒక్క హిట్ కూడా లేదు. డైరెక్టర్ శంకర్ చివరి రెండు సినిమాలు రోబో 2, ఐ అంతంత మాత్రంగానే ఆడాయి. దీంతో భారతీయుడు 2 తో హిట్ కొట్టి మళ్లీ తామెంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. అదే స్థాయిలో ట్రైలర్ కూడా ఉండటంతో భారతీయుడు 2 పై అంచనాలు పెరిగిపోయాయి. మరి 20 ఏండ్ల కిందట ఉన్న ఫ్యాన్స్ కు ఇప్పటి యువతరానికి తగ్గట్లు సినిమా ఆకట్టుకుంటుందా లేదా చూడాలి.