JAISW News Telugu

Kavya Maran : కావ్య మారన్ ఆస్తి ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..పాప చిన్నదే కానీ..

Kavya Maran

Kavya Maran

Kavya Maran : ఐపీఎల్ అంటేనే ఇండియాతో పాటు క్రికెట్ ఆడే దేశాల్లో ఫుల్ క్రేజ్. సమ్మర్ వచ్చిదంటే చాలు ఐపీఎల్ మజా మాములుగా ఉండదు. మ్యాచ్ లు జరిగేటప్పుడు ప్రతీ ఒక్కరు ఉత్కంఠకు లోనవుతారు. ఫ్యాన్స్ అరుపులు, కేకలే కాదు నరాలు తెగేలా వారు అనుభవించే ఉత్కంఠ మనకు కనిపిస్తూనే ఉంటుంది. తమ అభిమాన ఆటగాళ్లు, జట్ల కోసం ఫ్యాన్స్ కొట్టుకునేందుకు కూడా సిద్ధంగా ఉంటారు.  ఇక జట్టు ఓనర్ల గురించి మనకు తెలిసిందే. తమ జట్లు ఆడుతుంటే వారిని ఎంకరేజ్ చేయడానికి ఓనర్లు కూడా ప్రతీ మ్యాచ్ కు వస్తుంటారు. ఇందులో సన్ రైజర్స్ యజమాని కావ్య పాప చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఆమె హావాభావాలను కెమెరాల్లో బంధిస్తుంటారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాస్తవానికి సన్ రైజర్స్ కావ్య పాపతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటుందనుకోండి.

సన్ రైజర్స్ సీఈవోగా కావ్యమారన్ 2018 నుంచి వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ వేలం మొదలుకుని ఆ జట్టు ఆడే ప్రతీ మ్యాచ్ లోనూ కనిపిస్తారు. సన్ రైజర్స్ ఆటగాళ్లు బాగా ఆడి జట్టును గెలిపించినప్పుడు ఎంతో సంతోషంగా కనిపించే కావ్య.. ఓడినప్పుడు బాధపడుతుంటారు. ఆమె హావాభావాలను చూసి అయ్యో కావ్య పాప అనుకునే ఫ్యాన్స్ ఎందరో..

తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సన్ గ్రూప్ ఫౌండర్ కళానిధి మారన్ కుమార్తెనే ఈ కావ్య మారన్. 1992 ఏప్రిల్ 6న చెన్నైలో కావ్య జన్మించారు. ఆమె తల్లి కావేరి మారన్ సోలార్ టీవీ కమ్యూనిటీ రిస్ట్రిక్టెడ్ కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఇండియాలో అత్యధిక వేతనం తీసుకునే మహిళా సీఈవోల్లో ఆమె ఒకరు. కళానిధి మారన్ తండ్రి మురసోలీ మారన్ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. తమిళనాడు మాజీ సీఎం  కరుణానిధికి కళానిధి మారన్ సమీప బంధువు.

కావ్య మారన్ చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీ నుంచి కామర్స్ లో డిగ్రీ చదివిన ఆమె.. యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. రూ.33వేల కోట్ల సన్ గ్రూప్ వ్యాపార సామ్రాజ్యానికి కావ్య మారన్ ఒక్కరే వారసురాలు. జన్ భారత్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం కావ్య మారన్ ఆస్తుల విలువ రూ.417 కోట్లు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2019 ప్రకారం కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ ఆస్తుల విలువ రూ.19 వేల కోట్లు.

సన్ రైజర్స్ తో పాటు సన్ టీవీ నెట్ వర్క్ వ్యవహారాల్లోనూ కావ్య మారన్ చురుగ్గా పాల్గొంటారు. కేన్సర్ పేషెంట్లకు సాయం చేయడం, ప్రకృతి విపత్తుల బారిన పడిన వారికి అండగా నిలువడం వంటి సమాజహిత కార్యక్రమాలను కావ్య మారన్ చేపడుతున్నారు. 2018లో కావ్య మారన్ సీఈవోగా బాధ్యతలను స్వీకరించారు. వేలంలో సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయకపోవడంతో పాటు సన్ రైజర్స్ పేలవ ప్రదర్శన చేసిన సంవత్సరాల్లో కావ్య మారన్ ను ట్రోల్ చేసేవారు. అయితే క్రమంగా మంచి జట్టును తీసుకోవడంలో నేర్పు వహిస్తున్నారు. అంతేకాదు సౌతాఫ్రికా టీ 20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టు వరుసగా రెండు సీజన్లలో విజేతగా నిలిచింది. ఈస్ట్రన్ కేప్ జట్టును కావ్య మారనే పునాదుల నుంచి నిర్మించారు. ఇక తాజాగా సన్ రైజర్స్ టీంలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. మూడు మ్యాచ్ లు ఆడి రెండు ఓడి, ఒక మ్యాచ్ లో ఘన విజయం సాధించారు.

Exit mobile version