Virat Kohli : విరాట్ కోహ్లీ తినే బియ్యం కిలో ఎంతో తెలిస్తే కంగుతినాల్సిందే !
Virat Kohli : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఫిట్‌నెస్ విషయంలో ఎప్పుడూ కష్టపడుతూ ఉంటారు. విరాట్ కోహ్లీ పెరుగు, పాల ఉత్పత్తులు, గోధుమ పిండి చపాతీలు తినడు. వాటికి వీలైనంత దూరంగా ఉంటాడు. విరాట్ తన ఆహారంలో కార్బోహైడ్రేట్‌లను ఎక్కువగా తీసుకోడు. ఇది శరీరంలోని కొవ్వును వదిలించుకోవడానికి ఇది సహాయపడుతుంది. దీని కోసం విరాట్ కోహ్లీ వివిధ పదార్థాలతో చేసిన బ్రెడ్ మాత్రమే తింటాడు. కోహ్లి రెగ్యులర్ రైస్ కాకుండా స్పెషల్ రైస్ తింటాడు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఈ బియ్యాన్ని ప్రత్యేక పద్ధతిలో తయారుచేస్తారు. గ్లూటెన్ రహితంగా ఉండటం వల్ల, ఈ బియ్యంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. సాధారణ రుచి ఉంటుంది. ఈ బియ్యం కిలో రూ.400 నుంచి రూ.500 వరకు ఉంటుందట.
ఫిట్‌నెస్ కోసం చాలా విషయాల్లో రాజీ పడాల్సి వచ్చిందని విరాట్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. పాల ఉత్పత్తులను పూర్తిగా మానేసినట్లు తెలిపారు. గోధుమలతో చేసిన బ్రెడ్ కూడా తిననని కోహ్లీ చెప్పాడు. అదేవిధంగా ఫిట్‌నెస్ కోసం ఎన్నో స్వీట్లు తినడం కూడా మానేసినట్లు తెలిపాడు. అది మరింత ఫిట్‌గా ఉండేందుకు సహాయపడిందని తన ఫిట్‌నెస్ గురించి తెలియజేశాడు. అందుకే ఈ వయసులో కూడా కోహ్లి చాలా ఫిట్‌గా ఉన్నాడు.
తాను ఏం తినాలనుకుంటున్నానో తనకు బాగా తెలుసునని కోహ్లీ చెప్పాడు. వయసు మీద పడుతున్నా కొద్దీ ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కోహ్లికి ఇష్టమైన ఆహారాలలో చోలే బటర్ ఒకటి. అయితే తన ఆట, ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి సారించే కోహ్లీ చోలే బటర్‌ను కూడా తగ్గించినట్లు తెలుస్తోంది. అలాగే.. అల్పాహారం గురించి మాట్లాడుతూ కోహ్లీ మూడు గుడ్లు, ఒక గుడ్డు ఆమ్లెట్‌తో తన రోజును ప్రారంభిస్తాడు. అతను తన భోజనంలో ఉడికించిన చికెన్, మెత్తని బంగాళాదుంపలు, బచ్చలికూర, కూరగాయలను కూడా తింటాడు.