Elon Musk : నిమిషానికి ఎలాన్ మస్క్ సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

Elon Musk

Elon Musk

Elon Musk : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ఎంత తెలుసుకున్నా.. తెలుసుకోవాల్సంది మరెంతో ఉంటుంది. ఆయన దినచర్య నుంచి మొదలుపెడితే ఆయనేం తింటారు? ఆయన ఏ పుస్తకాలు చదువుతారు.? ఆయన ఎలా ఆలోచిస్తారు? ఆయనలో అంత పాజిటివిటీకి కారణం ఏమిటి? ఆయన భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? ..ఇలా ఎలన్ మస్క్ గురించి తెలుసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా జనాలు వెతుకుతుంటారు. ఆయన సంపాదన ఎంత ఉంటుంది? ఆయన సంవత్సరానికి ఎంత సంపాదిస్తారు? నెలకు ఎంత సంపాదిస్తారు? రోజుకు ఎంత సంపాదిస్తారు? అని..ఆయన సంపాదనపై లక్షలాది మందికి ఎంతో ఆసక్తి.. తాజాగా ఆయన సంపాదనపై కుల్లంకుల్లాగా ఓ నివేదిక వెల్లడించింది. దాన్ని చదివితే మీరు కచ్చితంగా వామ్మో అనక మానరు.

ప్రపంచ ధనవంతుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిమిషానికి దాదాపు 6,887 డాలర్లు(రూ.5.71లక్షలకు పైగా) సంపాదిస్తున్నారని ఫిన్ బోల్డ్ డేటా పేర్కొంది. అదే గంటకు 413,220 డాలర్లు(రూ.3.43కోట్లకు పైగా), రోజుకు 9,917,280 డాలర్లు(రూ.82.35 కోట్లు), వారానికి 69,420,960 డాలర్లు(రూ.576కోట్లకు పైగా) సంపాదిస్తున్నట్లు నివేదిక గురువారం వెల్లడించింది. ఫిబ్రవరి 2024 మధ్య నాటికి ఎలాన్ మస్క్ సంపద విలువ 198.9బిలియన్ డాలర్లుగా నివేదించబడింది. ఆయనకు ఉన్న మొత్తం ఆస్తులను పరిగణలోకి తీసుకుని ఈ డేటాను అందించినట్టు ఫిన్ బోల్డ్ తెలిపింది.

ఎలాన్ కు టెస్లాలో 20.5శాతం, స్టార్ లింక్ లో 54 శాతం, స్పేస్ ఎక్స్ లో 42 శాతం, ఎక్స్ లో 74 శాతం వాటా ఉంది. వీటితో పాటు XAI లో 25శాతం, న్యూరా లింక్ లో 50 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నారు. వీటి ఆధారంగా ఈ లెక్కలు వేశారు. ముఖ్యంగా టెస్లా ఎలక్ట్రిక్ కార్లు, స్పేస్ ఎక్స్ ద్వారా ఆయన ఆదాయంలో భారీగా వృద్ధి కనపడుతోంది. ఇటీవల వచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఎలాన్ మస్క్ 198.5 బిలియన్ డాలర్ల సంపాదనతో రెండో స్థానంలో ఉండగా.. గ్లోబల్ లగ్జరీ గూడ్స్ కంపెనీ బెర్నార్డ్ ఆర్నాల్డ్ 219.1 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.

TAGS