JAISW News Telugu

షాపింగ్, సినిమా బిల్స్ ఉంటే.. పార్కింగ్ ఫీజు తీసుకోవద్దు

Shopping

Shopping

Shopping : హైదరాబాద్ లో పార్కింగ్ ఫీజు వసూళ్ల నియంత్రణపై బల్దియా అధికారులు దృష్టి పెట్టారు. జీవో 63ను కఠినంగా అమలు చేయాలని అధికారులకు కమిషనర్ అమ్రపాలి ఆదేశాలు జారీచేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని సర్కిల్స్ లో తనిఖీల కోసం టీమ్స్ ను ఏర్పాటు చేశారు. అర్ధగంట వాహనాన్ని పార్క్ చేస్తే ఫీజు వసూలు చేయవద్దని, షాపింగ్, సినిమా బిల్స్ ఉంటే పార్కింగ్ ఫీజులు తీసుకోవద్దని సూచించారు. పార్కింగ్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారనేది ప్రతి మల్టీప్లెక్స్, థియేటర్లలో డిస్ ప్లే ఏర్పాటు చేయాలని అమ్రపాలి ఆదేశించారు.

జీహెచ్ఎంసీ సమస్యలపై ఫోకస్ పెట్టిన జోనల్, అడిషనల్ కమిషనర్లతో అమ్రపాలి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శానిటేషన్ వర్కర్ల హాజరు ఇంప్రూవు కావాలన్నారు. రోడ్లపై గుంతలు పూడ్చాలని చెప్పారు. చెరువులు, నాలాల దగ్గర చెత్త లేకుండా చూడాలని ఆదేశించారు. డెంగ్యూ కేసుల ట్రేస్ ఔట్ లో స్పీడప్ చేయాలన్నారు.

Exit mobile version