Health Tips : రాష్ట్రంలో వాతావరణం ఛేంజ్ అవుతోంది. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో మారిన వాతావరణ పరిస్థితుల్లో అందరికీ జలుబు, దగ్గు లాంటి ప్రాబ్లం వస్తాయి. జలుబు లేదా దగ్గు సాధారణంగా చలికాలంలో వచ్చే సమస్య అయినా చాలా మందిలో వేసవి కాలం ఎండింగ్ లో వస్తుంటుంది. ఎందుకంటే ఎండాకాలంలో ఉన్న వేడిని తట్టుకోవడానికి ప్రయత్నించి.. కూల్ డ్రింక్స్ తాగుతూ.. జ్యూసులు తాగుతూ దప్పిక తీర్చుకుంటుంటారు. కానీ దాని తర్వాత ఏర్పడే పరిణామాలు వేరేలా ఉంటాయి. ఒక్కసారి వెదర్ మారగానే ఇబ్బందులు ఎదురవుతాయి. జలుబు, దగ్గు తగ్గడానికి వాటి నుంచి ఉపశమనం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
అందులో తులసిలోని ఆయుర్వేద గుణాలు అత్యంత బలమైనవి. జలుబు, దగ్గు లాంటి సమస్యల నుంచి రక్షిస్తాయి. ప్రతి రోజూ ఉదయం నాలుగు లేదా అయిదు తులసి ఆకులను తీసుకుని నీటిలో ఉడకబెట్టుకుని తాగాలి. తులసినీ టీలో కూడా చేర్చుకోవచ్చు.
జలుబు దగ్గు తగ్గాలంటే మూలేతి, ముల్లంగి అత్యంత ఉపశమనం కలిగే ఔషధం. ఇది జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి బాగా ఉపయోగపడుతుంది. పావు టీ స్పూన్ మల్బరీ పొడి, కొద్దిగా దాల్చిన చెక్క పొడి, కొన్ని తులసి ఆకులు నీటిలో వేసి మరిగించాలి. దాన్ని మెల్లిగా చాయ్ తాగినట్లు తాగితే చాలా ఉపశమనం కలుగుతుంది.
జలుబు, దగ్గు నుంచి గణనీయమైన ఉపశమనాన్ని అందించే ఒక ఔషధం. గిలోయ్ రసాన్ని 2 టేబుల్స్ స్పూన్ల నీటిలో కలిపి తాగితే ఎంతో బాగా పని చేస్తుంది.గోరువెచ్చటి నీటిలో చెంచాడు, తేనే, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ కలుపుకుని తాగితే వారం రోజుల్లో దగ్గు, జలుబు నుంచి రీలిప్ పొందొచ్చు. వర్షాల సీజన్ లో ఇవి పాటిస్తే హాస్పిటల్స్ కు వెళ్లకుండానే ఈజీగా నయం చేసుకోవచ్చు.