Power : అధికారం ఉందని అతి చేస్తే.. అంతే సంగతి
Power : ఆర్థిక నేరస్తుడు, నియంత భావజాలం ఉన్న వ్యక్తికి అధికారం అప్పగిస్తే ఏమవుతుందో ఐదేళ్లు ఏపీ ప్రజలు అనుభవంలోకి తెచ్చుకున్నారు. తానూ జైలుకు వెళ్లొచ్చాను కాబట్టి రాష్ట్రంలోని ముఖ్య నాయకులందరూ జైలుకు వెళ్లి తీరాల్సిందే అన్నట్టుగా ఐదేళ్లల్లో జగన్ తనకు నచ్చని, తనను వ్యతిరేకించిన వారిని జైలుకు సాగనంపారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబును మొదలుకొని పార్టీలో ఉన్న ముఖ్య నేతలందరిపై కేసులు పెట్టడం ఇంటి తలుపులు కొట్టి మరీ బలవంతంగా అరెస్టులు చేయడం వైసీపీలో సర్వసాధారణ ఘటనగా మారిపోయింది. తనకు వ్యతిరేకంగా గళం విప్పిన పాపానికి సొంత పార్టీ ఎంపీ ఆర్ఆర్ఆర్ ను తెలంగాణ వెళ్లి మరీ అరెస్టు చేసి చితకబాదారు. నాటి నుంచి జగన్‌పై చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు రఘురామ రాజు.
ఐదేళ్ల నిరీక్షణ, నిస్సహాయతకు చరమ గీతం పాడేందుకు సిద్ధమయ్యారు ఆయన. వైసీపీ హయాంలోని తనను అక్రమంగా అరెస్టు చేసి హింసించిన నేరానికి గానూ సునీల్ కుమార్, సీతారామరాజు, జగన్ పై గుంటూరు నగర పాలెం పోలీస్ స్టేటన్ లో కేసు నమోదు చేశారు.
గత సీఎం జగన్ ఒత్తిడితోనే 2021, మే 14న సునీల్ కుమార్ చిత్ర హింసలు పెట్టారన్నారు. తనను శారీరకంగా హింసించి తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని, ఇదంతా జగన్ కనుసన్నల్లోనే సాగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆర్ఆర్ఆర్. ఇందులో సునీల్ కుమార్ ను A1గా, సీతారామాంజనేయులు A2, మాజీ సీఎం జగన్ ను A3 గా నమోదు చేశారు.
ఐదేళ్ల నుంచి కుంటిసాకులు చెప్పుకుంటూ అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేసుల విచారణకు హాజరవకుండా బెయిల్ పై తప్పించుకొని తిరుగుతున్న జగన్ ఈ కేసును సీరియస్ గా తీసుకుంటారా? లేక తన దినచర్యలో భాగంగా భావిస్తారా.? వేచి చూడాలి.
జగన్ ను నమ్ముకొని చట్టవ్యతిరేకంగా నడుచుకుంటే దోషిగా నిలబడక తప్పదని ఇప్పుడు ఈ అధికారులు రుజువుచేస్తున్నారు. చేతిలో అధికారం ఉంది కదా అని అతి చేస్తే అదే అధికారాన్ని కోల్పోయి చట్టం ముందు నేరస్తులుగా తలదించాల్సిందే కదా..!