Beer : బీరు తాగినప్పుడు ఇవి తిన్నారో.. లేని సమస్యలు కొనితెచ్చుకున్నట్టే..

Beer

Beer

Beer : బార్ కెళ్లి బీర్ కొట్టడం ఇప్పుడు సర్వసాధారణమై పోయింది.  యూత్ తో పాటు పెద్దలకు బీర్ అంటే ఎంతో ఇష్టం. బీరుకు ఉన్న క్రేజ్ మరే లిక్కర్ కు లేదనే చెప్పాలి. బీర్ టేస్ట్ ఎంత మజాను ఇస్తుందో బీరు ప్రియుల అందరికీ తెలిసిందే. బీర్ ను అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఇష్టంగా తాగుతుండడం నేటి ట్రెండ్. కార్పొరేట్ కంపెనీలు ఈ కల్చర్ ను ఎంకరేజ్ చేస్తున్నాయి.

ఇతర మద్యపానీయాల కన్నా బీర్ లో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండడం..కూల్ బీర్లు వేడి నుంచి ఉపశమనం కలిగించడంతో, సహజంగానే బీర్ల వినియోగం బాగా పెరుగుతోంది. బీరు తాగేటప్పుడు మంచింగ్ కింద రకరకాల ఫుడ్ తీసుకుంటుంటారు. ఎక్కువ మంది నాన్ వెజ్ ఫుడ్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే బీర్ తాగేటప్పుడు అధికంగా మసాలా వేసిన ఫుడ్ ను తీసుకోవద్దు.

మసాలాలు ఎక్కువగా ఉన్న చికెన్, మటన్ లాంటి పదార్థాలను బీర్ లేదా మరేదైనా ఆల్కహాల్ తో తీసుకోవడంవల్ల యాసిడ్ రిప్లక్స్ సమస్యలు వస్తాయి. కడుపు కూడా ఉబ్బరంగా ఉంటుంది. తద్వారా గ్యాస్, ఎసిడిటీ సమస్యలు మరింత పెరుగుతాయి. అలాగే బీర్ తో పాటు బ్రెడ్ ఐటెమ్స్ కూడా తినకూడదు. ఎందుకంటే బీర్, బ్రెడ్ రెండింటిలోనూ ఈస్ట్ ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో ఈస్ట్ ను మన కడుపు జీర్ణం చేయదు. తద్వారా జీర్ణసమస్యలు వస్తాయి.

ఇవే కాదు బీర్ తాగేటప్పుడు ఫ్రెంచ్ ప్రైస్, చిప్స్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. ఇందులో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. ఉప్పుగా ఉండే పదార్థాలు దాహాన్ని మరింత పెంచుతాయి. దీనివల్ల మరింత ఎక్కువగా బీర్ తాగేలా చేస్తాయి. చాలా మంది పల్లీలు, డ్రైఫ్రూట్స్ ను బీర్ తో పాటు తినడానికి ఇష్టపడుతారు. కానీ వీటిలో సాల్ట్ డీహైడ్రేషన్ సమస్యను కలిగిస్తుంది. తద్వారా ఎడీమా, హైబీపీ సమస్యలు వస్తాయి. అందుకు ఉప్పు తక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి.

TAGS