Chicken : ఎక్కువ శాతం నాన్ వెజ్ ఫుడీలకు బాగా నచ్చే మాంసం చికెన్. ఎక్కువ నిల్వ అవసరం లేదు. కావలసినంత మార్కెట్లు ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే చికెన్ ను ఎక్కువగా ఇష్టపడే వారిని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికి కారణం యాంటీ బయాటిక్స్ స్థాయిలు ఎక్కువవడమే. ఇది ఆరోగ్య నిపుణులతో పాటు భోజన ప్రియులు, చెఫ్ లను కూడా ఆందోళన కలిగిస్తోంది.
ఒక్క కోళ్లలోనే కాదు మేకలు, గొర్రెలు, చేపలు, రొయ్యలు అనే తేడా లేకుండా అన్నింటి పెంపకంలోనూ యాంటీ బయాటిక్స్వాడకం రాను రాను విపరీతంగా పెరుగుతోంది. అయితే, కోళ్లలోనే మాత్రం యాంటీ బయాటిక్స్రెసిస్టెన్స్పెరుగుతు
ఎన్రోఫ్లోక్సాసిన్, అమోక్సోక్లావ్, అమికాసిన్, ఇమిపీనమ్వంటి యాంటీ బయాటిక్స్కు 40 % వరకు రెసిస్టెన్స్ఉన్నట్టు సంస్థ తెలిపింది. చికెన్ పెంపకానికి యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడడం వలనే వాటితో హ్యుమన్ బాడీకి ఉపయోగించే యాంటీ బయాటిక్స్నిరోధకత పెరుగుతున్నట్టు హెచ్చరించింది. ప్రతీ యాంటీ బయాటిక్కు కోళ్లలో కొంత మేరకు రెసిస్టెన్స్ఉన్నట్టు స్టడీ నిర్ధారించింది.
మల్టీ డ్రగ్రెసిస్టెన్స్కోళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. మేకల్లో సెఫొటాక్సిమ్రెసిస్టెన్స్ 41 % ఉండగా అమికాసిన్కు 35 %, యాంపిసిల్లిన్కు 26 % నిరోధకత పెరుగుతున్నట్టు స్టడీ పేర్కొంది. అదే గొర్లలో కొంత మేర తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. వాటిల్లో 37 శాతం రెసిస్టెన్స్ఉన్నట్టు వెల్లడించింది.గొర్లు, మేకల్లోనూ కూడా రానురాను యాంటీ బయాటిక్స్ వాడకం పెరుగుతున్నదని హెచ్చరించింది.