Light Beer : బీరు’ ఈ పేరు వింటేనే మందు తాగే వారికి ఉత్సాహం ఉంటుంది. అసలే సమ్మర్.. మండుతున్న ఎండలో చిల్డ్ బీరు తాగితే ఆ మజానే వేరు. బీరును ఎక్కువగా యువత ఇష్టపడతారు. సరదాగా ఫ్రెండ్స్ తో కూర్చున్న సమయం, పండుగలు, ఇంకా పరిస్థితులను బట్టి బీరుకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు యూత్. మద్యం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలిసిందే. కానీ మితంగా తీసుకుంటే బీరు అంతగా హానికరం కాదని చెప్తున్నారు. ఒక గ్లాసు బీరు సులభంగా, ఆనందంగా గడిపేందుకు సాయపడుతుందట.
బీరు తయారీలో ఈస్ట్, హాప్ ఉంటాయి. వీటిని పులియ బెట్టడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. ఒక బీర్ క్యాన్ లో ఆల్కహాల్ గాఢత 4 నుంచి 6 శాతం వరకు మాత్రమే ఉంటుంది. 40 శాతం పోషకాలు ఉంటాయి. ఇందులో ఖనిజాలు, విటమిన్లు కూడా ఉంటాయట. బీరు మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి సాయం చేస్తుందని బేవరేజెస్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. బీరు తాగడం వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం.
గుండెకు ఆరోగ్యాన్ని
బీర్ గుండెకు ఆరోగ్యకరమైన ఆల్కహాలిక్ డ్రింక్. బీర్ తాగేవారితో పోలిస్తే తాగని వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 42 శాతం ఉన్నట్లు బయటపడిందట. అయితే అది కూడా మితంగానే ఉండాలట. అతి ఎప్పుడైనా చేటని చెప్తున్నారు. 5 శాతం ఆల్కహాల్ తీసుకోవచ్చని కూడా ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
బ్లడ్ షుగర్ నియంత్రణ
రక్తంలో చక్కెర (బ్లడ్ షుగర్) కొందరికి సమస్యగా ఉంటుంది. బీర్ మితంగా తీసుకుంటే చక్కెర లెవెల్స్ నియంత్రణలో ఉంచొచ్చు. బీర్ తాగడం డయాబెటిస్ కు ప్రమాదకరం అయినా ఇన్సులిన్ నియంత్రణకు కూడా బీర్ పని చేస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. చక్కెరతో కూడిన ఆల్కహాలిక్ బీర్ పానియాలను అవాయిడ్ చేయాలి.
కిడ్నీ స్టోన్స్
మూత్రనాళ వ్యవస్థలో అదనపు కాల్షియం నిల్వలను తగ్గించడంలో బీర్ వినియోగం సాయపడుతుందట. ఇది అధిక మూత్ర ఉత్పత్తి, మూత్ర నాళాలను విస్తరింపజేసి మూత్ర పిండాల్లోని రాళ్లను నొప్పి లేకుండా బయటకు పంపుతుందట. ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. అధికంగా బీరు తాగితే మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయట. కాబట్టి బీర్ వినియోగం మితంగానే ఉండాలి.
క్రియేటివిటీని కూడా పెరుగుతుందట..
బీర్ తాగుతున్న వారిలో క్రియేటివిటీ పెరిగిందని అధ్యనాలు చెప్తున్నాయి. దీనిపై కాన్షియస్‌నెస్ అండ్ కాగ్నిషన్ అనే జర్నల్ ఓ అధ్యయనం నిర్వహించింది. బీర్ తాగే పురుషులు, తాగని వారికంటే వేగంగా శబ్ధ పజిల్ ను పరిష్కరిస్తారని తేలింది.
వీటని పరిశీలిస్తే బీర్ తాగితే మంచిదే.. కానీ, అధికంగా తాగితే ప్రమాదమే.. జాగ్రత్త వహించాలి