Devara movie : జూనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన మూవీ దేవర త్వరలోనే విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలై అదరగొట్టింది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. ఏపీకి చెందిన కౌశిక్ (19) అనే అభిమాని బ్లడ్ క్యాన్సర్ తో బెంగళూరు లోని కిడ్స్ వై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కిడ్ వై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని చివరి కోరిక విని తెలుగు ప్రజలు కంట తడి పెట్టుకుంటున్నారు.
కౌశిక్ తల్లిదండ్రులు తిరుపతిలో మాట్లాడుతూ.. తన కొడుకు కౌశిక్ బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. అతడి చివరి కోరిక దేవర మూవీ చూడాలని అనుకుంటున్నారు. కనీసం దేవర మూవీ విడుదల వరకు అయినా అతడిని బతికించండి సర్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ జూనియర్ ఎన్టీఆర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వేడుకున్నారు. కౌశిక్ బ్లడ్ క్యాన్సర్ తో చివరి దశలో చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కాలం వెళ్లదీస్తున్నాడు.
దేవర మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ కు ట్రిఫుల్ ఆర్ తర్వాత రాబోతున్న మరో పాన్ ఇండియా చిత్రం. ఈ సినిమా గనక విజయం సాధిస్తే ఎన్టీఆర్ కు పాన్ ఇండియా లెవల్లో తిరుగుండదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా పక్కా ప్లాన్ తో వెళ్లారు.
కాగా ఇలా అభిమానులను చూసి జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే తన ఫ్యాన్స్ అంటే ఎంతో ఇష్టపడే జూనియర్ ఎన్టీఆర్ ఆ కుటుంబానికి సాయం చేయాలని కోరుతున్నారు. దేవర మూవీ రిలీజ్ వరకు అయినా అతడిని బతికించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదని అంటున్నారు. మరి పవన్ కల్యాణ్, అటు జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.