Buddha Purnima : బుద్ధ పూర్ణిమ రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా డబ్బే డబ్బు

Buddha Purnima

Buddha Purnima

Buddha Purnima : హిందూ గ్రంధాల ప్రకారం.. ప్రతి నెల చివరి తేదీని పూర్ణిమ తిథిగా పరిగణిస్తారు. హిందూ మతంలో ఇది చాలా ముఖ్యమైనదని చెబుతారు. ఈ రోజున స్నానం చేయడం, దానం చేయడం లాంటివి చేస్తే మనిషికి శుభ ఫలితాలు చేకూరుతాయి. వైశాఖ మాసంలో మే 23వ తేదీన పౌర్ణమి జరుపుకుంటారు. గౌతమ బుద్ధుడు వైశాఖ పూర్ణిమ రోజున జన్మించాడు. అందుకే ఈ రోజున ‘బుద్ధ పూర్ణిమ’ కూడా జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం.. వైశాఖ పూర్ణిమ నాడు దానధర్మాలు, ధార్మిక పనులు విశేష ప్రయోజనాలను తెస్తాయి. ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ శుక్రవారం, మే 23, 2023న వచ్చింది. వైశాఖ పూర్ణిమను బుద్ధ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ ప్రత్యేక బుద్ధ పూర్ణిమ రోజున ఇంట్లో కొన్ని ప్రత్యేక వస్తువులను తీసుకురావడం చాలా శ్రేయస్కరం. ఈ వస్తువులను తీసుకురావడం వల్ల మీ ఇంటికి ఆనందం కలుగుతుంది. ఐశ్వర్యం, అదృష్టం ఖాయమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఆ విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఇత్తడి ఏనుగు : బుద్ధ పూర్ణిమ రోజున ఇత్తడి ఏనుగును ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. బుద్ధ పూర్ణిమ రోజున ఇత్తడి ఏనుగును ఇంటికి తెచ్చుకుంటే.. ఇంటి దారిద్ర్యం తొలగిపోతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. మీ ఇల్లు శాంతి, శ్రేయస్సు , సంపదతో నిండి ఉంటుంది.

బుద్ధ విగ్రహం : బుద్ధ పూర్ణిమ రోజున బుద్ధుడు జన్మించాడు. అందుకే ఈ రోజున బుద్ధుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం కూడా చాలా శ్రేయస్కరం. ఫెంగ్ షుయ్ ప్రకారం.. గౌతమ బుద్ధుని విగ్రహం అదృష్టాన్ని తెస్తుంది. అందుకే బుద్ధ పూర్ణిమ రోజున తప్పనిసరిగా ఇంట్లోకి బుద్ధుని విగ్రహాన్ని తీసుకురావాలి.

వెండి నాణెం : దీపావళి మాదిరిగానే.. బుద్ధ పూర్ణిమ రోజున ఇంట్లో బంగారు లేదా వెండి నాణేలను తీసుకురావడం చాలా శ్రేయస్కరం. ముఖ్యంగా వెండి నాణెం మీ అదృష్టాన్ని మార్చగలదు. బుద్ధ పూర్ణిమ నాడు ఇంటికి వెండి నాణెం తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి, గణేశుడి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి.

 శ్రీ యంత్రం : హిందూ మత విశ్వాసాల ప్రకారం.. శ్రీ యంత్రంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అందుకే బుద్ధ పూర్ణిమ రోజున ఆ శ్రీ యంత్రాన్ని ఇంటికి తెచ్చుకోవాలి. వైశాఖ పూర్ణిమ శుభ సందర్భంగా ఇంటికి శ్రీ యంత్రాన్ని తీసుకురావడం వల్ల ఇంట్లో ఆర్థిక స్థితి బలపడుతుంది. మీ ఇంటి సభ్యులకు పురోగతిని తెస్తుంది.

గవ్వలు : హిందూ మత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవికి గవ్వలు చాలా ప్రియమైనవి. ఇలాంటి పరిస్థితుల్లో వైశాఖ పూర్ణిమ నాడు ఇంట్లోకి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉంటుంది.. ఇంట్లో ధన, ధాన్యాలకు లోటు ఉండదు.

TAGS