JAISW News Telugu

Donald Trump : ఎన్నికల్లో గెలిస్తే.. వారిని సాగనంపుతా: డొనాల్డ్  ట్రంప్

Donald Trump

Donald Trump

Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే, దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మిషిగాన్ లో నిర్వహించిన ప్రచారంలో ఆయన ప్రసంగిస్తూ తనకు ఓటు వేస్తే, రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి తరిమికొడతానని ప్రకటించారు. ఐసిస్ తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఎనిమిది మందిని అమెరికా అధికారులు శనివారం అరెస్టు చేసిన వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మన దేశం ఇప్పుడు ప్రమాదంలో పడిందని, వేలాదిమంది ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశిస్తున్నారని, దీనికి అనేక ఏళ్లపాటు భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని అన్నారు. వేలాది మంది రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశంలోకి అనుమతించే అధ్యక్షుడు కావాలా? లేదా అటువంటి వారిని దేశం నుంచి బయటకు పంపించే అధ్యక్షుడు కావాలా? అనేది నిర్ణయించుకోండని ట్రంప్ తెలిపారు.

అగ్ర రాజ్యంలోకి వలసలు పోటెత్తుతున్నాయని రిపబ్లికన్లు ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. వలసదారులు అమెరికాకు రావడాన్ని డెమోక్రటిక్ నేత, దేశాధ్యక్షుడు జో బైడెన్ సులభతరం చేశారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక సందర్భాల్లో ట్రంప్ తన వలసల వ్యతిరేక విధానాలను ఓటర్ల ముందు ఉంచారు. వలసదారులను పూర్తిగా తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.

Exit mobile version