Viral Photo : ‘‘ఇతరులను బాధిస్తే..మనం బాధపడే రోజూ వస్తుంది..’’.. వైరల్ ఫొటో
Viral Photo : సోషల్ మీడియాలో ఓ ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అందులో ఓ వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తుండగా పక్కనే అతడి కూతురు ఉంది. ఆమెను నవ్వించాలని ఆ వ్యక్తి నవ్వుతూనే ఉన్నాడు. ఆ ఫొటో ద్వారా మనకేం తెలుస్తుంది..అందులో అసలు కథ ఏంటో ఓ సారి చూద్దాం..
సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా రాసినందుకు ఓ దేశ అధ్యక్షుడు ఒక వ్యక్తికి మరణశిక్ష విధించాడు. ఇది ఎంత భయానక దృశ్యం. ఆ వ్యక్తిని క్రేన్‌కు వేలాడదీస్తున్నప్పుడు, అతడి 5 సంవత్సరాల కుమార్తె తన తండ్రిని చూస్తూ ఉండిపోతుంది. అతని కుమార్తె బాధను చూసి, ఆ తండ్రి తన చివరి క్షణాలలో కూడా నవ్వుతూ ఆమెను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. తాను చనిపోతానని అతడికి తెలుసు.. అయినప్పటికీ అతను తన కుమార్తెను నవ్వించాలని, ఆమె ముఖం నుంచి విచారాన్ని తొలగించాలని కోరుకున్నాడు. ఇప్పుడు ఆ ఉరి శిక్ష విధించిన కర్కష అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు.
ఆ ఫొటోలో ఉన్నది స్థూలంగా ఇది. ఇంతకీ ఆ అధ్యక్షుడు ఎవరంటే..మొన్న ఆదివారం హెలిక్యాప్టర్ ప్రమాదంలో చనిపోయిన ఇరాన్ అధ్యక్షుడు. ఇరాన్- అజర్‌బైజాన్ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్ ప్రారంభోత్సవంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో ఈ దుర్ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం తర్వాత హెలిక్యాప్టర్ లో రాజధాని టెహ్రాన్‌కు తిరుగు పయనం అయ్యారు రైసీ. ఈస్ట్ అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని వర్జాఖాన్- జోల్ఫా మధ్య అడవుల మీదుగా హెలికాప్టర్ ప్రయాణిస్తోన్న సమయంలో అది కుప్పకూలింది. దట్టమైన పొగమంచు వల్ల ఈ ప్రమాదం సంభవించింది. మృతుల శరీర భాగాలను గుర్తించడం కూడా కష్టమైంది.
ఇదిలా ఉంటే ఇరాన్ అధ్యక్షుడిగా రైసీ ఎన్నో అకృత్యాలు చేశాడని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తమ మత భావాలకు వ్యతిరేకంగా వార్తలు రాసేవారిని, నిరసన తెలిపేవారిని ఇరాన్ దారుణంగా ఉరిశిక్షలు విధించి చంపేశాడని రైసీ వ్యతిరేకులు అంటుంటారు.
చేసిన పాపం నుంచి ఎవరూ తప్పించుకోలేరని, కర్మ వదిలిపెట్టదని, సామాన్యుల ప్రాణాలను తీసిన రైసీ..చివరకు హెలిక్యాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారని అంటున్నారు. మనవల్ల ఇతరుల కుటుంబాలు బాధపడితే..తిరిగి మనం కుటుంబం కూడా బాధపడే పరిస్థితి తప్పక వస్తుందని చెబుతున్నారు.