Trivikram Srinivas : టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉన్న స్నేహం అందరికీ తెలిసిందే. వీరి మధ్య బాండింగ్ అంత ఫర్పెక్ట్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ తన ఆప్త మిత్రుడైన త్రివిక్రమ్ ను ఎంతగానో నమ్ముతుంటాడు. పవన్ కల్యాన్ గత చిత్రాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తోపాటు బ్రో సినిమాకి కూడా త్రివిక్రమ్ తెరవెనుక ఎంతగానో సపోర్ట్ చేశాడు. ప్రస్తుతం ఎన్నికల సందడి అయిపోవడంతో పవన్ కల్యాన్ పొలిటికల్ కాస్త బ్రేక్ తీసుకున్నాడు. తన పాత చిత్రాలతో పాటు కొత్త ప్రాజెక్టుల పైనా దృష్టి పెట్టారు. ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ) మూవీ తన పార్ట్ చిత్రీకరణు త్వరగా ముగించాలని భావిస్తున్నాడు. ఇది పూర్తి కాగానే ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న హరి హర వీరమల్లు, ఇటీవల షూటింగ్ స్టార్ట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలను ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేయాలని పవన్ ఫిక్సయ్యాడు. అలాగే త్రివిక్రమ్ కూడా పవన్ కళ్యాణ్ రాబోయే ప్రాజెక్టులను సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నారనే టాక్ నడుస్తున్నది.
అయితే ముందుగా త్రివిక్రమ్ కథ విని ఓకే అంటేనే పవన్ ఆ సినిమా చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారనే చర్చ నడుస్తున్నది. పవన్ రెగ్యులర్ పాలిటిక్స్ లో బిజీగా మారినప్పటి నుంచి ఈ పద్ధతి కొనసాగుతున్నట్లు టాక్. త్రివిక్రమ్ ప్రస్తుతం యువ దర్శకులతో చర్చల్లో పాల్గొటున్నారు. వారి స్క్రిప్టులు వింటున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ కోసం కొత్తగా రెండు చిత్రాలను లైన్ లో పెడుతున్నారని సమాచారం.
ఇందులో ఒకటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. కొన్ని నెలల్లో ఈ ప్రాజెక్టులు ఫైనల్ కానున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెస్ట్ లో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత తిరిగి చిత్రాలకు రావడానికి పవన్ పూర్తిగా సన్నద్ధమవుతారు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ పై నమ్మకంతోనే ఈ ప్రాజెక్టులు ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచుతున్నాయి.
త్రివిక్రమ్ సలహాలతోనే పవన్ గత చిత్రాలు భారీ విజయాలు సాధించాయని, భవిష్యత్తులో రాబోయే చిత్రాలపై కూడా అలాగే సక్సెస్ అవుతాయని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ మధ్య ఉన్న ఈ అనుబంధం, ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం పొందింది. ఇక రాబోయే రోజుల్లో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తే చూడాలి అని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే అది ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా లేదు.
అయితే అజ్ఞాతవాసి మచ్చ చెరిపేలా మరో సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పర్ఫెప్ట్ స్క్రిప్ట్ రెడీ అయితే తప్ప త్రివిక్రమ్ సినిమా చేయడానికి పవన్ ఒప్పుకోకపోవచ్చు. అజ్ఞాతవాసి చిత్రాన్ని మర్చిపోయేలా త్రివిక్రమ్ ఒక హిట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.