JAISW News Telugu

KA Paul : రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే..: కేఏ పాల్ ‘సీరియస్’ వార్నింగ్.. వణికిపోతున్న ఆ నలుగురు మంత్రులు!?

KA Paul 'serious' warning

KA Paul serious warning

KA Paul : కేఏ పాల్.. రెండు తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియా సంచలనం. ఆయన ఉన్న చోట మీడియా అలర్ట్ అవుతుంది. ఆయన ఎప్పుడేం మాట్లాడుతారా? అని వీడియోలు పట్టుకుని రెడీగా ఉంటారు కెమెరామెన్లు. ఆయన వ్యాఖ్యలను యూట్యూబ్ చానళ్లు తెగ వైరల్ చేసుకుంటూ ఉంటాయి. ఇది తెలిసే ఆయన కూడా ప్రవర్తిస్తుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన రెండు రాష్ట్రాల పట్టునే ఉంటున్నారు. గతంలో ప్రపంచ దేశాల్లో క్రిస్టియన్ మత ప్రబోధకుడిగా పేరు ప్రఖ్యాతులు సాధించిన.. ఆయన కొంతకాలంగా ప్రజాశాంతి పార్టీని స్థాపించి ఇక్కడి రాజకీయాల్లో నిత్యం తన కామెంట్స్ తో వైరల్ అవుతున్నారు.

తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కేఏ పాల్  మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ లో నలుగురు మంత్రులపై  సంచలన ఆరోపణలు చేశారు.  ఆయన మాటాలు ఇలా ఉన్నాయి..‘‘రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు నలుగురు మంత్రులు ప్రయత్నిస్తున్నారట. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వానికి వెన్నుపోటు పొడిచినట్టుగా రేవంత్ ను దించి ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారు. వారికి గుండు గీకిస్తా.. పైకి పంపించేస్తా..’’అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇంకా ‘‘ ఒళ్లు దగ్గర పెట్టుకోండి. ఎవడైనా జంప్ జిలానీల వంద కోట్లు, వెయ్యి కోట్లు ఇచ్చి  ఏదైనా పార్టీలో చేరారా.. తెలంగాణ కుర్రాళ్లు మీ ఇండ్లకు వచ్చి ఇండ్లు తగలబెట్టేస్తారు జాగ్రత్త’’ అంటూ ఫైర్ అయ్యారు.

ప్రస్తుతం కేఏ పాల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే సాధారణంగా కేఏ పాల్ కామెంట్స్ ను అందరూ ఫన్నీగానే తీసుకుంటారు. ఆయన ఎంత సీరియస్ కామెంట్లు చేసినా జనాలు ఎంటర్ టైన్ మెంట్ గానే చూస్తారు. ఇది కూడా అలాంటిదే. కానీ ఆయన చెప్పిన విషయం మాత్రం విలువైనదే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడమనేది రాజ్యాంగ వ్యతిరేకం. డబ్బులతో నేతలను కొనడం, అధికారాన్ని లాక్కోవడం, ప్రభుత్వాలను పడగొట్టడం లాంటివి ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. మరి కేఏ పాల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ మంత్రులు సీరియస్ గా తీసుకుంటారా? కామెడీగా నవ్వుకుంటారో చూడాలి.

Exit mobile version