CM Revanth : చంద్రబాబు, నితీశ్ లాంటి వారు ఉంటే ఏడాదిలో కాంగ్రెస్ నుంచి ప్రధాని : సీఎం రేవంత్

CM Revanth

CM Revanth

CM Revanth : చంద్రబాబు, నితీశ్ కుమార్ లాంటి వారు మద్దతిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడాదిలో ప్రధాన మంత్రి వస్తారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నుంచి తదుపరి ప్రధాని రావడానికి ఇంకెంత కాలం పడుతుందని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా రేవంత్ రెడ్డి పై విధంగా జవాబిచ్చారు.

ప్రస్తుతం సిద్ధాంతపరమైన రాజకీయాలు తక్కువగా ఉన్నాయని అన్నారు. జనరేషన్ గ్యాప్ కారణంగా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు స్విగ్గీ పాలిటిక్స్ నడుస్తున్నాయని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇంట్లో అమ్మ, నానమ్మ భోజనం పెడితే తినవారమని.. ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్ పెడితే రెండు నిమిషాల్లో వస్తుదన్నారు. ఇప్పుడు రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

పీఎం మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా ఇప్పటి వరకు తెలంగాణలోని భద్రాచల రాముడి దర్శనం చేసుకోలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న నీటి సహా ఇత సమస్యలపై విన్ విన్ పద్ధతిలో పరిష్కరించుకోవలసి ఉందన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400కు పైగా సీట్లు గెలుచుకుంటామని చెప్పి, 240 వద్ద ఆగిపోయిందన్నారు. ఇది బీజేపీ ఓటమిగా తాను భావించడం లేదని, మోదీ ఓటమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓడిపోతున్నప్పటికీ రాహుల్ గాంధీ ఫీల్డ్ ను వదలలేదన్నారు.

ఏబీవీపీలో తాను దేశం పట్ల నిబద్ధతతో ఎలా ఉండాలో నేర్చుకున్నానని, టీడీపీలో అభివృద్ధి, సంక్షేమం గురించి తెలుసుకున్నానని, కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉందని వ్యాఖ్యానించారు. ఉత్తరాది నుంచి ఏ సెలబ్రిటీని మీ క్యాంపెయిన్ కోసం తీసుకోవాలనుకుంటారని మీడియా ప్రతినిధి నలుగురి పేర్లను రేవంత్ రెడ్డి ముందు ఉంచగా బాలీవుడ్, క్రికెట్ క్రీడాకారులు ప్రజలు చూసేందుకు మాత్రమే వస్తారని, ఓట్లు మాత్రం పడవని అన్నారు.

TAGS