Holi Festival : అక్కడ స్త్రీలకు మగాళ్లు దొరికారా ఇక అంతే..బట్టలు చించేసి…

Holi Festival

Holi Festival

Holi Festival : హిందూ సంప్రదాయంలో ప్రతీ పండుగకు ఓ విశిష్టత ఉంటుంది. ప్రతీ పర్వదినానికి ప్రత్యేక నేపథ్యంతో పాటు వివిధ ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. అలాగే రంగుల కేళీ హోలీని చిన్నా పెద్దా అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారనేది తెలిసిందే. ఈ ఏడాది మార్చి 25న హోలీని దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు.

హోలీని దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో జరుపుకుంటారు. అయితే ఓ ప్రాంతంలో మాత్రంలో చాలా వినూత్నంగా జరుపుకుంటారు. హోలీ పండుగకు బర్సాన ప్రదేశం చాలా ఫేమస్. ఇక్కడ హోలీ పండుగ రోజున రాధారాణి ఆలయంలో లాత్ మార్ హోలీ అనే ఆటను ఆడుతారు. లాత్ మార్ హోలీలో కొన్ని వేల మంది సాక్షిగా మహిళలు పురుషులను కర్రలతో కొడుతారు. పురుషులు ఆ దెబ్బలు తాకకుండా డాలు లేదా షీల్డ్ తో తమను తాము కాపాడుకుంటారు. మహిళలంతా బ్రజ్ భాషలో పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తారు.

పక్కనే ఉన్న నందగావ్ గ్రామం నుంచి వచ్చే పురుషుల కోసం మహిళలంతా కర్రలతో ఎదురుచూస్తూ ఉంటారు. ఆ పురుషులు ఊళ్లోకి అడుగుపెట్టగానే లాఠీలతో తరుముతూ రంగులు పులుముతూ పరుగులు పెడుతూ సందడి చేస్తారు. ఈ సంప్రదాయం శ్రీకృష్ణుడు గోపికల మధ్య జరిగిన కథకు అనుసంధానంగా చెప్పుకుంటారు.

TAGS