Divorce : భార్య అలా చేస్తే డైరెక్ట్ విడాకులే.. హై కోర్టు సంచలన తీర్పు..!!

Divorce
Divorce : తాజాగా బాంబే హైకోర్టు విడాకులకు సంబంధించి ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. ఇకపై జీవిత భాగస్వాముల్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించినా లేదా అలాంటి ప్రయత్నానికి పాల్పడినా, దానిని హింసగానే పరిగణించవచ్చునని కోర్టు స్పష్టం చేసింది.
హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 13(1)(ia) ప్రకారం, ఇలాంటి చర్యలను భరించడం కష్టమని భావించే జీవిత భాగస్వామి విడాకులు కోరవచ్చని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పు ద్వారా, మానసిక వేదనకు గురిచేసే ఇలాంటి బెదిరింపులు లేదా ప్రయత్నాలను కోర్టు తీవ్రంగా పరిగణిస్తుందని స్పష్టమవుతోంది. ఇది వైవాహిక జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితుల్లో బాధితులకు ఒక ముఖ్యమైన న్యాయపరమైన రక్షణగా నిలుస్తుంది.