Vote to CM KCR : ఆ ముగ్గురూ బతికుంటే కేసీఆర్ కే ఓటు.. ఇంతకీ ఎవరంటే..?
Vote to CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో దిట్ట. ఆయన వ్యూహానికి చిక్కిన పార్టీలు, నేతలు బయట పడేందుకు విలవిలలాడాల్సిందే. తెలంగాణ ను ప్రగతి బాట పట్టించి, పదేళ్లలో రాష్ర్టంలో వెలుగులు నింపిన మహానేత ఆయన. ఈ సందర్భంగా ఆయన తెలిపితేటలను ముగ్గురితో పోల్చుతున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. వారు బతికుంటే కూడా సీఎం కేసీఆర్ కే ఓటు వేసేవారని ఈ సందర్భంగా చెబుతున్నారు.
భీష్ముడు, విదురుడు, చాణక్యుడు.. ముగ్గురు ఎవరికి వారే సాటి. ఒకరు మహాయోధుడు, మరొకరు నీతి కొవిదుడు, ఇంకొకరు వ్యూహకర్త. వీరంతా పాలనా సూత్రాలు తెలిసినవారు. రాజ్యంలోని ప్రజల క్షేమాన్ని కాపాడే ధీరులు. ముగ్గురు రాజ్యాలకు పథ నిర్దేశకులే. ఇక వీరిలోని ఎన్నో సద్గుణాలను కలగలిపిన వ్యక్తిగా కేసీఆర్ ను ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
ఇక తెలంగాణలో జరుగుతున్న ఈ ఎన్నికల యుద్ధంలో ప్రజాసైన్యం కేసీఆర్ వైపు నిలబడితే, పొరుగు రాష్ర్టాల నుంచి తరలివచ్చిన నోట్ల కట్టలు, బాడుగ నేతలంతా ప్రతిపక్షాల వైపు నిల్చున్నాయని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇక లక్ష్యసాధనలో నాయకుడు తనదైన మార్గాన్ని ఎంచుకుంటాడని, తనవైన వ్యూహాలను అమలు చేస్తాడని అంతిమంగా అనుకున్న లక్ష్యానన్ని సాధిస్తాడని చెబుతున్నారు. ఇక ఈ ఎన్నికల యుద్ధ సమయంలో భీష్ముడు, విదురుడు, చాణక్యుడు కనుక మరోసారి భూలోకానికి వస్తే తప్పకుండా తెలంగాణను సందర్శిస్తారని చెబుతున్నారు.
గంగా సుతుడైన భీష్మ పితామహుడు కాళేశ్వరం ఒడిన కుటీరం నిర్మించుకుంటాడు. ధర్మపక్షపాతి అయిన విదురుడు ముఖ్యమంత్రి నివాసాన్ని ఆవాసంగా మార్చుకుంటాడు. పాలనా శాస్ర్తం తెలిసిన చాణక్యుడు సచివాలయ భవన కేంద్రంగా నేతలను తయారు చేస్తాడు. రేపటి నేతలను తీర్చిదిద్దుతారు. పోలింగ్ రోజున వెళ్లి ముగ్గురు కారు గుర్తుకు ఓటేస్తారని చెబుతున్నారు. విజయోస్తు, దిగ్విజయోస్తు, పునర్ అధికార ప్రాప్తిరస్తు అంటూ చంద్రశేఖరుడిని ఆశీర్వాదిస్తారంటూ బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.