JAISW News Telugu

Sukumar : బన్నీ గడ్డం గురించి తీగ లాగితే.. సుకుమార్ వరకు కదిలిన డొంక.. ఇంతకీ ఐకాన్ స్టార్ గడ్డం వెనక కథేంటి?

FacebookXLinkedinWhatsapp
allu arjun

allu arjun

Allu Arjun – Sukumar : బన్నీ తన గడ్డంను ట్రిమ్ చేశారన్న టాక్ సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ‘పుష్ప2: ది రూల్’ గెటప్ లో కీలకమైన సన్నివేశాలను బన్నీ ఇలానే చిత్రీకరణ పూర్తి చేశాడా? అన్న ప్రశ్న అభిమానులను అయోమయానికి గురి చేస్తోంది. దర్శకుడు సుకుమార్ తో విభేదాలు రావడం వల్లే ఇలా చేశాడని, మరోసారి పుష్ప 2 షూటింగ్ బ్రేక్ తప్పదని, ఆగస్ట్ 15న రిలీజ్ అన్న మూవీని డిసెంబర్ 6కు పొడిగించారని ఇక అప్పటి వరకు కూడా విడుదల కావడం అనుమానమనే తరహాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక అగ్నికి ఆజ్యం పోసినట్టు బన్నీ గడ్డం తగ్గించిన కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో అవి కొత్తవా? లేదంటే పాతవా? కన్ఫ్యూజన్ నెలకొంది.

ఆగస్ట్ 15 డేట్ వదులుకున్న నిర్మాతలు డిసెంబర్ 6ను మాత్రం వదులుకునేందుకు సిద్ధంగా లేరు. సుకుమార్, బన్నీకి సైతం అది ఇష్టం లేదు. అలాంటిదేమైనా జరిగితే 2025 సమ్మర్ వరకు ఛాన్స్ ఉండదు. సంక్రాంతి మొత్తం బ్లాక్ అయిపోయింది. బన్నీ, సుకుమార్ మధ్య విభేదాల ప్రచారం.. రెక్కలు వచ్చేందుకు కారణం ఇద్దరూ వేర్వేరుగా విదేశీ ట్రిప్పులు ప్లాన్ చేసుకోవడమే. అలిగి వెళ్లిపోయారని ఒకరు.. లేదు.. లేదు.. కీలక ఆర్టిస్టుల డేట్లు దొరకనందు వల్ల అని మరొకరు యూనిట్ నుంచి చెబుతున్న మాట.

నిజా నిజాలు ఏమైనా కానీ వీలైనంత త్వరగా ‘పుష్ప 2: ది రూల్’ నుంచి ఒక అప్ డేట్ వస్తే వీటికి చెక్ పెట్టొచ్చు. ట్రైలర్ ఇంకా ప్లాన్ చేయలేదు. క్లైమాక్స్ తో కలిపి ఇంకో 30 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి వేగంగా పరుగులు పెట్టాలి. మూవీ మేకింగ్ లో వేగం కోసం మూడు యూనిట్లు పని చేస్తున్నాయని సమాచారం. వాయిదాలతో అల్లు అర్జున్ కొంత అసహనానికి గురై ఉండొచ్చు కానీ.. ఆర్య లేనిదే అల్లు అర్జున్ లేడని ఇటీవలె సుకుమార్ (Sukumar) మీద తన అభిమానాన్ని వ్యక్త పరిచిన బన్నీ కోరిమరీ గొడవ పెట్టుకునే ఛాన్స్ లేదని ఫ్యాన్స్ అంటున్నారు.

Exit mobile version